ముగ్గురికి పాజిటివ్‌.. 80 వేల మంది తరలింపు

27 Jul, 2020 19:50 IST|Sakshi

హో చి మిన్‌: కరోనా మహమ్మారి కట్టడిలో వియాత్నం విజయవంతమైనట్లు గతంలో వినే ఉన్నాం. ఈ దేశంలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ​ చాలా బలహీనం. అయినప్పటికి అక్కడి ప్రభుత్వం వైరస్‌ కట్టడి కోసం కఠినాతికఠినమైన లాక్‌డౌన్‌ అమలు చేసింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ తర్వాత వియాత్నంలో తాజాగా నిన్న(ఆదివారం) మూడు కరోనా కేసులు వెలుగు చూశాయి. దాంతో వియాత్నం ప్రభుత్వం హై అలర్ట్‌ ప్రకటించింది. అంతేకాకా దనాంగ్‌ సెంట్రల్‌ టూరిజమ్‌ హాట్‌స్పాట్‌ నుంచి దాదాపు 80 వేల మంది స్థానిక పర్యాటకులను తలిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. వీరిని తరలించడానికి దేశీయ విమాన సంస్థలు దనాంగ్‌ నుంచి దేశంలోని ఇతర నగరాలకు రోజు సుమారు 100 విమానలను నడపనున్నట్లు తెలిపింది. ఈ తరలింపు ప్రక్రియకు నాలుగు రోజులు పడుతుందని ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాక దనాంగ్‌ నుంచి వెళ్లిన వారు తప్పని సరిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించింది. దనాంగ్‌లో కఠినమైన సామాజిక దూరం అమల్లోకి రానున్నుట్లు తెలిపింది. (చిన్న దేశాలు.. పెద్ద విజయాలు)

వియాత్నంలో ప్రజా ఆరోగ్య వ్యవస్థ చాలా బలహీనం. అయినప్పటికి కూడా కరోనా కట్టడి కోసం విస్తృతంగా పరీక్షలు నిర్వహించడంతో ఇప్పటివరకు ఇక్కడ నమోదైన కేసుల సంఖ్య కేవలం 420 మాత్రమే. కొత్త కేసులు వెలుగులోకి రావడంతో అక్రమ వలసలపై అణిచివేత చర్యలను వేగవంతం చేయాలని ప్రధానమంత్రి నూగూయెన్‌ షువాన్‌ ఫుక్ పోలీసులను ఆదేశించారు. చైనా నుంచి వియత్నాంలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రజలకు సహాయపడే ఒక క్రిమినల్ గ్రూపుకు అధిపతి అయిన 42 ఏళ్ల చైనా వ్యక్తిని దనాంగ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు స్థానిక మీడియా ఆదివారం తెలిపింది.

మరిన్ని వార్తలు