డిసెంబర్‌లో కరోనా వ్యాక్సిన్‌

26 Oct, 2020 14:18 IST|Sakshi

న్యూఢిల్లీ : ఇప్పటికే రెండు ట్రయల్స్‌ను దిగ్విజయంగా పూర్తి చేసుకొని మూడవ ట్రయల్స్‌ను కొనసాగిస్తోన్న ‘ఆక్స్‌ఫర్డ్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌’ మొదటి విడతను ఈ డిసెంబర్‌ నెలలోగా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ పరిశోధకులు కృషి చేస్తున్నారు. అందుకు అవసరమైన అధికారిక అనుమతిని క్రిస్మస్‌లోగా పొందేందుకు ప్రయత్నాలను వారు ముమ్మరం చేశారు. వ్యాక్సిన్‌‌కు సంబంధించి మూడవ ట్రయల్స్‌‌ కూడా విజయవంతం అయితేగానీ అధికారిక అనుమతి లభించదు. ( అది చాలా ప్రమాదకరం: డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ )

అయితే కరోనా బారిన పడిన రోగులకు వైద్య సేవలు అందిస్తూ తాము ఆ వైరస్‌ బారిన పడుతోన్న వైద్య సిబ్బందికి, వ్యాక్సిన అత్యవసరంగా అందించాల్సిన అవసరం ఉన్న వృద్ధ రోగులకు మొదటి విడత కింద డిసెంబర్‌లో వ్యాక్సిన్‌ అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నామని వ్యాక్సిన్‌ ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహిస్తోన్న ఆక్స్‌ఫర్డ్‌ ప్రొఫెసర్‌ ఆండ్రియన్‌ హిల్‌ మీడియాకు తెలిపారు. మూడవ విడత ట్రయల్స్‌ పూర్తి కాక మునుపే మొదటి విడత వ్యాక్సిన్‌ డోసుల విడుదలకు అనుమతి కోరుతున్నామని, క్రిస్మస్‌లోగా అనుమతి వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. మూడవ ట్రయల్స్‌ పూర్తయ్యాక దేశ ప్రజలతోపాటు ఒప్పందం చేసుకున్న దేశాల ప్రజలకు వ్యాక్సిన్‌ డోస్‌లను 2021 తొలినాళ్లలో తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రొఫెసర్‌ ఆండ్రియన్‌ వివరించారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు