పొగాకు నుంచి కోవిడ్‌ వ్యాక్సిన్‌?

1 Aug, 2020 06:57 IST|Sakshi

లండన్‌: పొగాకు నుంచి కరోనా వ్యాక్సిన్‌ రానుందా అంటే అవుననే చెబుతోంది బ్రిటిష్‌ అమెరికన్‌ పొగాకు సంస్థ లూసీ స్ట్రైక్స్‌ సిగరెట్స్‌. ఆ కంపెనీకి చెందిన కెంటకీ బయో ప్రాసెసింగ్‌ తయారు చేస్తున్న వాక్సిన్‌ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని చెప్పింది. పొగాకు ఆకుల నుంచి సంగ్రహించిన ప్రొటీన్‌తో వ్యాక్సిన్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పింది.

దీనికి యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌  అనుమతి రావాల్సి ఉందని చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ కింగ్‌ స్లే వీటన్‌ చెప్పారు. కోవిడ్‌ జెనెటిక్‌ సీక్వెన్స్‌ను పరిశీలించాక దాన్ని పొగాకులోని ప్రొటీన్లతో అణచివేయవచ్చని ఈ దిశగా ప్రయోగాలు చేపట్టబోతున్నట్లు స్ట్రైక్స్‌ సిగరెట్స్‌ సంస్థ ఇటీవలే తెలిపింది.  ఆరు వారాల్లోనే ఈ వాక్సిన్‌ తయారు చేయవచ్చని అప్పట్లో తెలిపింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పొగాకు ఉత్పత్తిదారులు కూడా ఈ తరహా ప్రయోగాలు మొదలు పెట్టారు. 

మరిన్ని వార్తలు