కరోనా సోకిన అగ్ర నేతలు వీరే !

7 Oct, 2020 16:12 IST|Sakshi

ఢిల్లీ: కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఎవ్వరినీ విడిచిపెట్టడం లేదు. ఈ జాబితాలో సామాన్య ప్రజలే కాదు అగ్రరాజ్యాల అధిపతులు సైతం కరోనా మహమ్మారికి అతీతం కాదు. ప్రపంచ దేశాల్లో కరోనా బారినపడ్డ  నేతలు ఎవరెవరో  తెలుసుకుందామా...

డొనాల్డ్‌ ట్రంప్‌: కరోనా వ్యాప్తి చెందినప్పటి నుంచి మాస్క్‌ పెట్టుకోకుండా తిరిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చివరకు మాస్క్‌ పెట్టుకోక తప్పలేదు. అక్టోబర్‌ 1న ఆయనకు కరోనా నిర్ధారణ అయ్యింది. 'వాల్టర్‌ రీడ్‌'లోని ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందారు. క్వారంటైన్‌కు వెళ్లి నాలుగు రోజులు కూడా ఉండకుండా తిరిగి 'వైట్‌హౌస్‌'కు చేరుకున్నాడు. ఐతే ఈ సారి మాస్క్‌ పెట్టుకొని కనిపించారు. తన కారులో మాస్క్‌ ధరించి ప్రజలకు అభివాదం చేస్తున్న ఫొటో సోషల్‌ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. 

జాన్‌ బోరిస్‌: బ్రిటన్ ప్రధాని 'జాన్‌ బోరిస్‌'కు ఏప్రిల్‌ 5న కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఆయనకు కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్ష చేసుకోగా పాజిటివ్‌ అని తేలింది. ఏప్రిల్‌ 9 వరకు ఐసీయూలో చికిత్స పొందాడు. కొన్ని రోజులకు పూర్తిగా కోలుకున్నారు. 

జైర్‌ బొల్సొనారో: బ్రెజిల్‌ అధ్యక్షుడు 'జైర్‌ బొల్సొనారో'కు జూలై 7న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకున్నారు. 

జీయనైన్‌ ఆనెస్‌: బొలివియా తాత్కాలిక అధ్యక్షురాలు 'జీయనైన్‌ ఆనెస్‌'కు జూలై 19న కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. 'సెల్ఫ్‌ ఐసోలేషన్‌'లో ఉంటూ చికిత్స పొందారు. ఇప్పుడు ఆమె పూర్తిగా కోలుకున్నారు. 

అమిత్‌ షా: భారత కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షాకు ఆగస్టు 2న కరోనా నిర్ధారణ అయ్యింది. ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకున్నారు.

 

సోఫియా గ్రెగోర్‌ ట్రూడాయ్‌: కెనడా ప్రధాని 'జస్టిన్‌ ట్రూడాయ్‌' సతీమని సోఫియాకు మార్చిలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.  'సెల్ఫ్‌ ఐసోలేషన్‌'లో ఉంటూ చికిత్స పొందారు. 

(ఇదీ చదవండి: ట్రంప్ మరో ప్రధాన సలహాదారుడుకి పాజిటివ్)

మరిన్ని వార్తలు