కరోనా సోకిన మొదటి శునకం మృతి..

31 Jul, 2020 09:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వాషింగ్టన్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ మానవుల ప్రాణాలపైనే కాకుండా జంతువులపై కూడా ప్రభావం చూపుతోంది. తాజాగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన మొట్టమొదటి శునకం మృత్యువాత పడింది. కరోనా లక్షణాలతో పోరాడుతూ జర్మన్‌ షెఫెర్డ్‌ జాతికి చెందిన ఈ శునకం యూఎస్‌ఏలో ప్రాణాలు విడిచినట్లు నేషనల్‌ జియోగ్రాఫిక్‌ మ్యాగజైన్‌ నివేదించింది. కాగా ఏడేళ్ల వయస్సున్న బుడ్డీ అనే పెంపుడు శునకాన్ని రాబర్ట్‌ మహోనీ అనే వ్యక్తి పెంచుకుంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో అతనికి కరోనా సోకి కోలుకున్నారు. అదే సమయంలో పెంపుడు కుక్క అనారోగ్యానికి గురైంది. ఈ క్రమంలో దానికి పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. (అక్కడ కుక్క మాంసమే స్పెషల్‌..)

రానురానూ బడ్డీకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు మూసుకుపోవడం వంటి సమస్యలతో బాధపడుతూ వచ్చింది. తరువాత కొన్ని వారాలు, నెలల్లోనే దాని పరిస్థితి మరింత దిగజారి కనీసం నడిచేందుకు కూడా ఇబ్బంది పడింది. దీంతో ఇటీవల రక్తపు వాంతులు చేసుకుని మరణించినట్లు మహోనీస్‌ తెలిపారు. అనంతరం పుడు కుక్క కళేబరాన్ని ఖననం చేశారు. ఇదిలా ఉండగా అమెరికాలో ఇప్పటివరకు 10 పిల్లులు, 12 కుక్కలు, ఓ పులి, సింహం కరోనా బారిన పడ్డాయని యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వెల్లడించింది. (వైరల్‌: ఇందులో నాలుగు ఏనుగులు.. కాదు!)

మరిన్ని వార్తలు