దక్షిణాసియాలో ఉగ్రవాదాన్ని సహించం

19 Sep, 2020 08:26 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో తమ‌ ప్రభుత్వం ఏర్పాటైతే దక్షిణాసియాలో టెర్రరిజాన్ని సహించబోదని బైడెన్‌ ఎన్నికల ప్రచార నిర్వాహకులు చెప్పారు. భారత దేశం అమెరికా సహజ భాగస్వాములని నమ్ముతున్నామని తెలిపారు.  భారత్‌-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడానికి అత్యధిక ప్రాధాన్యమిస్తామని తెలిపారు. అమెరికాలోని హిందూ, అమెరికన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ వివిధ అంశాలతో ఒక ప్రశ్నావళి తయారుచేసి, తమ తమ అభిప్రాయాలను తెలపాల్సిందిగా అధ్యక్షస్థానానికి పోటీ చేస్తోన్న పార్టీలకు పంపించింది. మొట్టమొదటిగా ఆ ప్రశ్నావళికి బైడెన్‌ రాతపూ ర్వకం గా సమాధానమిచ్చారు. ఇరువురూ ఈ ప్రశ్నావళికి ఇచ్చిన సమాధానాలను బట్టి, నవంబర్‌ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో కమిటీ నిర్ణయిస్తుంది.(చదవండి: బైడెన్‌కే భారతీయుల బాసట)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు