ఎల్‌ఈడీ లైట్లతో కరోనా ఖతం!

16 Dec, 2020 21:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలను భయ భ్రాంతులకు గురిచేస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ను అంతమొందించడానికి మానవాళికి మరో ఆయుధం దొరికింది. ఎల్‌ఈడీ లైట్ల నుంచి వెలువడే అల్ట్రా వయలెట్‌ కిరణాలతో కరోనా వైరస్‌ను ఇట్టే ఖతం చేయవచ్చని శాస్త్రవేత్తలు నిరూపించి చెబుతున్నారు. అల్ట్రా వయెలెట్‌ కిరణాలతో కరోనా వైరస్‌ చనిపోతుందని శాస్త్రవేత్తలు ఇదివరకే నిరూపించారు. అయితే ఎల్‌ఈడీ లైట్ల నుంచి వెలువడే అల్ట్రా వయెలెట్‌ కిరణాలతో కూడా వైరస్‌ను 99.9 శాతం చంపవచ్చని ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ యూనివర్శిటీ చెందిన ప్రొఫెసర్‌ హదాస్‌ మమేన్‌ మొదటి సారి నిరూపించారు. 

గదుల్లో, ఇళ్లలో కరోనా వైరస్‌ లేకుండా చేయడానికి వెంటిలేటర్ల వద్ద, ఏసీ గదుల్లో గాలీ పీల్చుకునే ఏసీ వెంటిలేటర్ల వద్ద ఎల్‌ఈడీ బల్బులను అమర్చుకోవాలని, బస్సుల్లో, రైళ్లలో, క్రీడా ప్రాంగణాల్లో శాస్త్రీయంగా ఆలోచించి ఎల్‌ఈడీ లైట్లను అమర్చాలని ఆయన సూచించారు. మార్కెట్లో అందుబాటులో ఉన్న చౌక ఎల్‌ఈడీ బల్బులను ఉపయోగించే తాము విజయవంతంగా కరోనా వైరస్‌ను అంతం చేయగలిగామని ప్రొఫెసర్‌ హదాస్‌ మమేన్‌ వివరించారు. చౌకైనా ఎయర్‌ ప్రెషర్స్‌లో ఎల్‌ఈడీ లైట్లను ఉపయోగించడం ద్వారా కూడా ఈ వైరస్‌ను నిర్మూలించవచ్చని ఆయన చెప్పారు.

>
మరిన్ని వార్తలు