Morning Top 10 News: మార్నింగ్‌ టాప్‌ 10 తెలుగు న్యూస్‌

16 Jul, 2022 09:54 IST|Sakshi

1.ఆదుకో.. మావయ్యా.. గమనించిన సీఎం జగన్‌ కాన్వాయ్‌ ఆపి..
కాన్వాయ్‌ వేగంగా దూసుకెళుతున్నప్పటికీ ఆపన్న హస్తం కోసం రోడ్డు పక్కనే ఎదురు చూస్తున్న ఓ కుటుంబం సీఎం జగన్‌ దృష్టి నుంచి దాటిపోలేదు. విశాఖ షిప్‌ యార్డులో కాంట్రాక్ట్‌ కార్మికుడిగా పనిచేసే పొన్నపువ్వు ప్రసాద్‌ అనారోగ్యంతో మృతి చెందాడు.

👉 పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

2.భద్రా‘జలం': క్షణక్షణం భయం భయం.. రంగంలోకి సైన్యం
భద్రాచలం వద్ద గోదావరి మరింత ఉధృతంగా మారుతోంది. గంటగంటకూ మరింతగా వరద మట్టం పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 10 గంటల సమయానికి 71 అడుగులతో ఉప్పొంగి ప్రవహిస్తోంది.

👉 పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

3.గోదా'వర్రీ'!.. 3వ ప్రమాద హెచ్చరిక జారీ 
గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఉప నదులు ఉప్పొంగుతుండటంతో అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతి చూసి జనం హడలిపోతున్నారు. లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి.

👉 పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

4.పావులు కదుపుతున్న బోరిస్‌ జాన్సన్‌.. రిషి సునాక్‌ ఓటమికి స్కెచ్‌!
బ్రిటన్‌ ప్రధాని రేసులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బ్రిటన్‌ మాజీ ఆర్థిక మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ ప్రధాని రేసులో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇక, బ్రిట‌న్ ప్ర‌ధాని ప‌ద‌వి కోసం రిషి సునాక్‌, పెన్నీ మార్డౌట్‌తో సహా మ‌రో ఐదుగురి మ‌ధ్య పోటీ సాగుతున్న‌ది.

👉 పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

5.పన్నీరు సెల్వానికి షాకిచ్చిన పళనిస్వామి
పన్నీర్‌ సెల్వంను పార్టీ నుంచి తప్పించేందుకు పళనిస్వామి యత్నిస్తున్నారా? అవుననే సమాధానం అన్నాడీఎంకేలో వినిపిస్తోంది. ఇప్పటికే పన్నీర్‌సెల్వం, ఆయన అనుచరులపై బహిష్కరణ వేటు వేసిన పళనిస్వామి, ప్రధాన ప్రతిపక్ష ఉపనేత హోదా నుంచి తొలగించే యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. 

👉 పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

6.తగ్గేదేలే.. కేంద్రంపై సమరమే..!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అసంబద్ధ విధానాలపై పార్లమెంటుతో పాటు దేశవ్యాప్త నిరసనలు చేపట్టాలని సీఎం, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు.

👉 పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

7.తాజా సర్వే: ఈ యువతకు ఏమైంది? పెళ్లి వద్దంటున్నారు!
ఏ వయసు ముచ్చట ఆ వయసులో తీరాలని పెద్దలు అంటారు. ఉద్యోగం వచ్చి కెరీర్‌లో స్థిరపడ్డాకే పెళ్లి అనే భావన మన దగ్గర పెరిగి చాలాకాలం అయ్యింది. ఇప్పుడు పెళ్లే వద్దనుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరగడం గమనించాల్సిన సంగతి.

👉 పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

8.అదానీ గ్రూప్‌ చేతికి ఇజ్రాయెల్‌ పోర్టు
ఇజ్రాయెల్‌లోని పోర్ట్‌ ఆఫ్‌ హైఫా ప్రైవేటీకరణ టెండర్‌ను దేశీ దిగ్గజం అదానీ గ్రూప్‌లో భాగమైన అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఏపీసెజ్‌), గాడోట్‌ గ్రూప్‌ కన్సార్టియం దక్కించుకుంది. 

👉 పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

9.రెమ్యునరేషన్‌ లెక్కలు బయటపెట్టిన కీర్తి
పారితోషికం పెంచలేదని అంటోంది కీర్తి సురేష్‌. కొన్ని చిత్రాలకు తగ్గించే రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నానని అంటోంది ఈ బ్యూటీ. దక్షిణాది సినిమాలో నటి కీర్తీసురేశ్‌కు అంటూ కచ్చితంగా ఒక పేజీ ఉంటుంది. జాతీయ అవార్డును గెలుచుకున్న ఈ అమ్మడు ఇటీవల మహేశ్‌బాబు సరసన ‘సర్కారు వారి పాట’లో నటించి విజయాన్ని సాధించింది.

👉 పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

10.ఐర్లాండ్‌ ఓడినా... వణికించింది!
అయ్యో... ఐర్లాండ్‌! కొండను కరిగించే పనిలో పరుగు తేడాతో ఓడింది. ఇదివరకే న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ కోల్పోయిన ఐర్లాండ్‌ మూడో మ్యాచ్‌ ఓటమితో ‘వైట్‌వాష్‌’ అయ్యింది. కానీ అసాధారణ పోరాటంతో ఆఖరి బంతి దాకా కివీస్‌ ఆటగాళ్లను వణికించింది

👉 పూర్తి ఆర్టికల్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు