Covid-19: డిసెంబరులో కరోనాతో 10 వేలమంది మృతి!

11 Jan, 2024 13:52 IST|Sakshi

కరోనా ఇన్ఫెక్షన్ కేసులు ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ పెరుగుతున్నాయి ప్రత్యేకించి కరోనా జెఎన్‌.1 వేరియంట్ కేసులు నమోదవుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. సింగపూర్, అమెరికాలో కరోనా వేవ్ అక్కడి ‍ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. భారతదేశంలో కూడా గడచిన 50 రోజుల్లో కరోనా కేసులు భారీ సంఖ్యలోనే పెరిగాయి.

ఇటీవలి క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవుల్లో జనం జాగ్రత్తలు పాటించకపోవడంవల్ల ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ మరింతగా విస్తరించిందని ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్‌గా టెడ్రోస్ అధనామ్ తెలిపారు. గత డిసెంబర్‌లో కరోనా ఇన్‌ఫెక్షన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 10 వేలమంది మరణించారని  పేర్కొన్నారు. 50 దేశాల నుంచి అందిన డేటా ప్రకారం ఆసుపత్రుల్లో చేరుతున్న రోగుల సంఖ్య కూడా 42 శాతం  మేరకు పెరిగిందన్నారు. 

భారతదేశంలో కూడా కరోనా ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయని, ప్రతిరోజూ సగటున 600 వరకూ కొత్త కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 514 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,422. దీనికిముందు  అంటే బుధవారం కొత్తగా 605 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా కారణంగా రోజుకు సగటున ఐదుగురు మృత్యువాత పడుతున్నారని వివిధ నివేదికలు చెబుతున్నాయి. 

>
మరిన్ని వార్తలు