Long Covid: కోవిడ్‌-19 తగ్గినా..ఐక్యూ ముప్పు పెరిగింది!

5 Mar, 2024 14:03 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 కేసులు నియంత్రణలో ఉన్నప్పటికీ, దీని బారినపడిన వారిని వెంటాడుతున్న లాంగ్‌ కోవిడ్‌ ముప్పు ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది. కరోనాపై చేసిన పలు పరిశోధనలలో సార్స్‌- కోవ్‌-2 వైరస్ దీర్ఘకాలంలో హాని కలిగిస్తుందని తేలింది. దీని దుష్ప్రభావాలు గుండె, ఊపిరితిత్తులపై ఉంటాయని వెల్లడయ్యింది.

కోవిడ్‌-19పై ఇటీవల జరిపిన అధ్యయనాలు కరోనా కారణంగా మెదడు సంబంధిత సమస్యల ముప్పును తెలియజేశాయి. కరోనా ఇన్‌ఫెక్షన్‌ బారిన పడిన బాధితులలో చాలా మంది వ్యాధి నుంచి కోలుకున్నాక వారిలో జ్ఞాన సామర్థ్యం(ఐక్యూ) తగ్గిపోతున్నదని పరిశోధనల్లో తేలింది. 

నిపుణుల బృందం కోవిడ్-19 నుండి కోలుకున్న వారిలో  ఒక  ఏడాది తర్వాత  వారి ఐక్యూ స్థాయిలో మూడు పాయింట్ల తగ్గుదలను కనుగొంది. ఇది మెదడు సంబంధిత ముప్పుపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజేస్తోందని నిపుణులు అంటున్నారు. మెదడు పనితీరులో తగ్గుదల జీవన నాణ్యతపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు తెలిపారు. ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ఈ పరిశోధనా వివరాలు ప్రచురితమయ్యాయి. 

whatsapp channel

మరిన్ని వార్తలు