అమెరికా, సౌత్‌కొరియాలకు నార్త్‌ కొరియా వార్నింగ్‌ | Sakshi
Sakshi News home page

అమెరికా, సౌత్‌కొరియాలకు నార్త్‌ కొరియా వార్నింగ్‌

Published Tue, Mar 5 2024 8:14 AM

North Korea Warning To America South Korea - Sakshi

ప్యాంగ్‌యాంగ్‌: సౌత్‌ కొరియా, అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న మిలిటరీ విన్యాసాలు తమ దేశంపై దాడి కోసమేనని, ఇందుకు తాము సరైన రీతిలో స్పందిస్తామని ఉత్తరకొరియా హెచ్చరించింది. ఈ మేరకు ఉత్తరకొరియా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. 11 రోజుల పాటు నిర్వహించే మిలిటరీ డ్రిల్‌ను సౌత్‌కొరియా, అమెరికా కలిసి తాజాగా ప్రారంభించాయి.

ఈ డ్రిల్‌లో భాగంగా గత ఏడాది కంటె రెట్టింపు విన్యాసాలను రెండు దేశాలు చేయనున్నాయి.‘ఇవి పూర్తి బాధ్యతా రహితమైన మిలిటరీ విన్యాసాలు, సార్వభౌమ దేశమైన నార్త్‌కొరియాను ఆక్రమించేందుకు సౌత్‌కొరియా, అమెరికాలు కలిసి మిలిటరీ డ్రిల్‌ ముసుగులో ప్రయత్నిస్తున్నాయి’అని నార్త్‌కొరియా విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో నార్త్‌ కొరియా, సౌత్‌ కొరియా మధ్య ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే. 

ఇదీ చదవండి.. ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వర్షాలు..39 మంది మృతి 

Advertisement
Advertisement