Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10

23 Apr, 2022 17:01 IST|Sakshi

ర‌క్ష‌ణ విషయంలో రష్యాపై ఆధారపడొద్దు: అమెరికా
భారత్‌-రష్యా బంధంపై అమెరికా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్‌ ర‌క్ష‌ణ అవ‌స‌రాలకు సంబంధించి ర‌ష్యాపై ఆధార‌ప‌డటాన్ని ఏమాత్రం తాము ప్రోత్సహించడంలేదని యూఎస్‌ రక్షణ కార్యాలయం పెంటగాన్‌ అభిప్రాయపడింది.

సీఎం కేజ్రీవాల్‌ ‘క్రేజీ’ ఆఫర్‌.. ఛాన్స్‌ ఇస్తారా..?
ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌.. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు.. దేశంలో జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ పెంచిన కేజ్రీవాల్‌.. శనివారం హిమాచల్‌ ప్రదేశ్‌లో పర్యటించారు. .

పంజాబ్‌ సీఎం మరో కీలక నిర్ణయం.. 184 మంది భద్రత ఉపసంహరణ
పంజాబ్‌లో భారీ విజయంతో అధికారం చేపట్టిన ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ప్రభుత్వం పలు కీలక సంస్కరణలు చేపడుతోంది. తాజాగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వం శనివారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 

ఒకే ఫ్యామిలీలో ఐదుగురు దారుణ హత్య.. యువతిపై అత్యాచారం..?
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. కాగా, మృతిచెందిన వారిలో రెండేళ్ల చిన్నారి కూడా ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

ఏపీలో 4 వేల ‘ఈవీ’ చార్జింగ్‌ స్టేషన్లు
ప్యాసింజర్‌ ఆటోలను రెట్రోఫిట్టింగ్‌ చేసి ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చే ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లో 4 వేల ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (ఈవీ) చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు..

కేంద్రం అబద్దాలు చెప్తూ ప్రచారం చేస్తోంది: హరీష్‌ రావు
పాదయాత్రలు చేస్తున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అవాకులు చెవాకులు పేలుతున్నారని మంత్రి  హరీష్ రావు మండిపడ్డారు. ఒక అబద్ధాన్ని నిజం లాగా చిత్రీకరిస్తూ.. గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడని అన్నారు. 

'కాతు వాకుల రెండు కాదల్‌' తెలుగు ట్రైలర్‌ రిలీజ్‌..
టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ సమంత, లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార, విలక్షణ నటుడు, కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి కలిసి నటించిన చిత్రం 'కాతు వాకుల రెండు కాదల్‌.'

ధోనికో లెక్క.. పంత్‌కో లెక్కా..? నో బాల్‌ వివాదంలో ఆసక్తికర చర్చ 
రాజస్థాన్‌ రాయల్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 22) జరిగిన మ్యాచ్‌లో నో బాల్‌ విషయంలో ఢిల్లీ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ చేసిన ఓవరాక్షన్‌పై సర్వత్రా చర్చ నడుస్తుంది. 

ఆ విషయం గురించి హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌లో కూడా ఇలా చెప్పలేరు
చుట్టూ కనిపించే విషయాల నుంచే చక్కని బిజినెస్‌ పాఠాలు చెప్పడం ఇండస్ట్రియలిస్ట్‌ ఆనంద్‌ మహీంద్రా స్పెషాలిటీ. ముఖ్యంగా మనకు తెలియకుండా సాధారణంగా చేసే పనుల్లో ఎంతో విలువైన వ్యాపార సూత్రాలు దాగి ఉంటాయి. 

ప్రియుడితో గొడవ.. ప్రాణ భయంతో ఎనిమిదో అంతస్తు నుంచి దూకింది!
ప్రాణ భయంతో ఎనిమిదవ అంతస్తు నుంచి దూకింది ఓ మహిళ. తుపాకీతో ప్రియుడే చంపే ప్రయత్నం చేయగా.. తప్పించుకునే క్రమంలో ఆమె అలా దూకేసింది. 

మరిన్ని వార్తలు