అంతరిక్షయాత్ర విజయవంతంగా ముగించుకుని భూమికి చేరిన వ్యోమగాములు

27 Sep, 2023 21:08 IST|Sakshi

మాస్కో: నాసాకు చెందిన ఇద్దరు శాస్త్రవేత్తలు, రోస్కోస్మొస్‌కు చెందిన మరో శాస్త్రవేత్త సుదీర్ఘ అంతరిక్ష యాత్రను ముగించుకుని క్షేమంగా  భూమికి చేరారు. వీరు ప్రయాణించిన స్పేస్‌క్రాఫ్ట్ సోయుజ్ ఎంఎస్-23 కజకిస్తాన్‌లోని జెజ్‌కజ్‌గాన్ నగరంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. 

రోస్కోస్మొస్‌ వ్యోమగాములు సెర్గె ప్రొకొపియేవ్, దిమిత్రి పెటెలిన్ నాసా వ్యోమగామి ఫ్రాన్సిస్ రూబియో సెప్టెంబర్ 21, 2022లో సోయుజ్ ఎంఎస్-23 స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణమయ్యారు. వ్యోమగాములు క్షేమంగా భూమి మీదకు చేరిన విషయాన్ని రోస్కోస్మొస్, నాసా సంస్థలు ధృవీకరించాయి. 

రష్యా వ్యోమగాములు సెర్గె ప్రొకొపియేవ్, దిమిత్రి పెటెలిన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 370 రోజుల 21 గంటల 22 నిముషాలు గడిపినట్లు ప్రకటించగా నాసా తమ వ్యోమగామి ఫ్రాన్సిస్కో రూబియో 371 రోజుల పాటు అంతరిక్షంలో గడిపినట్లు ఎక్స్(ట్విట్టర్)లో ప్రకటించింది.

వాస్తవానికి వీరు ఆరు నెలల క్రితమే భూమికి చేరుకోవాల్సి ఉండగా చిన్న ఉల్క తాకిడికి స్పేస్‌క్రాఫ్ట్‌లో లీక్ చోటుచేసుకోవడంతో అది సాధ్యపడలేదు. సిబ్బంది లేకుండా మాస్కో మరో రాకెట్ పంపడంతో దానిలో ముగ్గురు వ్యోమగాములు తిరుగుప్రయాణమయ్యారు. సెప్టెంబర్ 27, 2023కి భూమికి చేరుకొని కజకిస్తాన్‌లో క్షేమంగా ల్యాండ్ అయ్యారు. 

ఇది కూడా చదవండి: USA : ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు

మరిన్ని వార్తలు