క్వారంటైన్‌ ఉల్లంఘించినందుకు వియత్నంవాసికి ఐదేళ్ల జైలుశిక్ష

7 Sep, 2021 21:28 IST|Sakshi

హనోయి: కోవిడ్‌ నిబంధనలను ఉ‍ల్లంఘించినందుకుగాను వియత్నాంకి చెందిన లెవాన్‌ ట్రై అనే వ్యక్తికి అక్కడి ప్రాంతీయ కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ట్రై.. హోచి మిన్‌ సిటీ నుంచి తన సొంత ఊరు కా మౌకి వెళ్లి చాలా మందికి ఈ వైరస్‌ను అట్టించాడంటూ వియత్నాం ప్రాంతీయ కోర్టు తన నివేదికలో తెలిపింది. ట్రై క్వారంటైన్‌ నిబంధలను ఉల్లంఘించి.. బయట తిరగి వైరస్‌ని వ్యాప్తి చేయడం వల్ల ఒకరు చనిపోవడం, మరికొంతమంది రకరకాల వ్యాధుల భారినపడినట్లు నివేదిక పేర్కొంది. హోచి మిన్‌ సిటీలో కరోనా కేసులు తక్కువగానే ఉన్నాయనని, ట్రై కారణంగా కేసులు అధికమైనట్లు నివేదిక వెల్లడించింది. (చదవండి: 41 ఏళ్లుగా అడవిలోనే.. స్త్రీలంటే ఎవరో తెలియదు)

ఆగస్టు 7న ట్రైకి కరోనా పాజిటివ్‌ వచ్చిందని.. కానీ అతడు 21 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండకుండా బహిరంగప్రదేశాల్లో తిరగడం వల్ల చాలా మందికి వైరస్‌ని వ్యాప్తి చేశాడని నివేదిక పేర్కొంది. గత నెలలో ట్రై మాదిరిగా చేసిన మరికొంతమందికి  కూడా వియత్నాం ప్రాంతీయ కోర్టుల ఇలాంటి శిక్షే విధించడం గమనార్హం. వియత్నాంలో సంకర కరోనా మ్యూటెంట్‌ ( హైబ్రిడ్‌ మ్యూటెంట్‌)కి సంబంధించిన ఏడు రకాల వేరియంట్లను శాస్త్రవేత్తలు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇలాంటి కఠిన చర్యలతో కరోనాకు అడ్డుకట్టవేయడానికి వియాత్నం శతవిధాలా ప్రయత్నిస్తోంది.

చదవండి: కోవిడ్‌ నెగిటివ్‌.. అయినా క్వారంటైన్‌.. ఏకంగా బెడ్‌షీట్లతో..

మరిన్ని వార్తలు