ఒమిక్రాన్‌ ప్రమాదకారి కాదని అనుకోవద్దు, ఆస్పత్రుల్లో చేరుతున్నారు.. ప్రాణాలు పోతున్నాయ్‌

7 Jan, 2022 10:08 IST|Sakshi

WHO Alert World On Omicron variant As Serious Issue: కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచవ్యాప్తంగా విజృభిస్తుంది. అయితే చాలా దేశాలు ఈ వేరియంట్‌ని చాలా తేలికగా తీసుకుంటున్నాయని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంతేకాదు ఇది అంత పెద్ద ప్రమాదకారి కాదని కొట్టిపారేయకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరించింది. ఈ మేరకు డబ్ల్యుహెచ్‌వో చీఫ్ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కీలక ప్రకటన విడుదల చేశారు.

‘‘ఒకవైపు డెల్టా వేరియంట్‌తో పోటీపడుతూ ఒమిక్రాన్‌ వేగంగా విజృభిస్తుంది. అంతేకాదు మరోవేపు కేసులు రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వారం వ్యవధిలో 71 శాతం కొత్త కేసులు రావడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారాయన. పైగా ఆస్పత్రులు కొత్త వేరియెంట్‌ పేషెంట్లతో నిండిపోతున్నాయి. నిజానికి డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తక్కువ తీవ్రతతో ఉన్నట్లు కనిపించడంతో తీవ్రత లేదని భావిస్తున్నారంతా. కానీ, అది వాస్తవం కాదు. ఒమిక్రాన్‌ తీవ్రత వల్లే ఆస్పతి పాలవుతున్నారు. చనిపోతున్నారు కూడా.  రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి సైతం సంక్రమించడం ఆందోళన కలిగిస్తోందని, మరోవైపు ప్రాణాలు పోయే ముప్పు సైతం పొంచి ఉందని టెడ్రోస్ కీలక వ్యాఖ్యలు చేశారు.


(చదవండి: క్యూఆర్‌ కోడ్‌ ఉన్నపెప్సీ ట్రక్‌లను తగలబెట్టేస్తా!)

వ్యాక్సిన్‌ తీసుకున్నాం కదా అని నిర్లక్ష్యంగా ఉండకూడదని, వ్యాక్సిన్‌ కేవలం రక్షణ వలయం లాంటిదని చెప్తున్నారాయన. అంతేకాదు కోవిడ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకి సునామీలా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఓవైపు క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకలు, సెలవుల వల్ల కేసులు పెరగ్గా.. కోవిడ్‌ పరీక్షలు నిర్వహించడంలో పలు దేశాలు విఫలం అయ్యాయని, అందుకే కేసులు రికార్డు స్థాయిలో పెరుగతున్నాయని అన్నారు. ఈ ఏడాది ప్రతి దేశం కూడా 70% వ్యాక్సినేషన్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయాలని ఆకాంక్షించారు.

కోవిడ్ -19 టెక్నికల్ లీడ్ వాన్ కెర్ఖోవ్ మాట్లాడుతూ.. "ఒమిక్రాన్‌ కరోనా వైరస్‌ చివరి వేరియెంట్‌ కాదు. ఎప్పుడు ముగుస్తుందో కచ్చితంగా చెప్పలేం. ఒమిక్రాన్‌ వేరియంట్‌ను నుండి తమను తాము రక్షించుకోవడానికి వారు ఇప్పటికే తీసుకుంటున్న చర్యలను మరింత వేగవంతం చేయాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి" అని ప్రపంచాన్ని కోరారు. అయితే తాము 2022 ఏడాది చివరిలో కూడా ఈ కరోనా గురించి ఇంకా ప్రసంగించే పరిస్థితి ఏర్పడితే.. అంతకన్నా విషాదం ఇంకోకటి ఉండదు అని డబ్ల్యూహెచ్‌ఓ ఎమర్జెన్సీ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ ఆవేదనగా చెప్పారు.

(చదవండి: తల్లే పిల్లల్ని కిడ్నాప్‌ చేసింది.. ఎందుకో తెలుసా?)

మరిన్ని వార్తలు