ఆ రెండు నియోజకవర్గాల గెలుపోటములపై లక్షల్లో బెట్టింగ్‌లు.. మరి గెలిచేది ఎవరు?

1 Dec, 2023 11:45 IST|Sakshi

బీఆర్‌ఎస్‌ వర్సెస్‌ కాంగ్రెస్‌

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జోరుగా చర్చ

రెండు నియోజకవర్గాల్లో టెన్షన్‌

గెలుపోటములపై జోరుగా బెట్టింగ్‌ 

సిరిసిల్లక్రైం: జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకులకు, ప్రజల నుంచి అత్యంత స్పందన అచిరకాలంలో గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు గెలుపోటములపై కార్యకర్తలు, అభిమానులు జోరుగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు.

వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్‌ను భారత్‌ పాకిస్థాన్‌ క్రికెట్‌ పోటీని వీక్షించిన విధానంలో ఓట్ల లెక్కింపును చూసే అవకాశాలున్నాయని సీనియర్‌ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే లక్షల రూపాయల్లో బెట్టింగ్‌కు ఆజ్యం పలికిన నాయకులు ఉన్నారని, ఇలా బెట్టింగ్‌ చేసిన వారందరూ ఓట్ల లెక్కింపు జరిగే ఆదివారం ఒకే వేదికగా ఉండి పండుగ చేసుకునేందుకు ప్రణాళికలు జరుగుతున్నాయి.

సిరిసిల్ల నియోజకవర్గంలో అభివృద్ధిని ప్రచారం చేసిన కేటీఆర్‌కు విజయం కాస్త అటు.. ఇటుగా ఉంటుందనుకుంటున్న వాళ్లు లేకపోలేదు. కానీ వేములవాడలోని త్రిముఖ పోరులు అందరూ ఉద్దండులేనని ఇక్కడి ఫలితాలపై నియోజకవర్గప్రజలు అత్యంత ఆసక్తిగా ఉన్నారని సమాచారం.

ఏది ఏమైనా గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో నేతలు హోరాహోరీగా ప్రచారాలు, పార్టీల బడా నేతలు రావడం వంటి వాటితో గెలుపు ఆయా పార్టీ బాధ్యులు ఆసక్తిగా ఎదరుచూస్తూ బెట్టింగ్‌లకు దిగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇలాంటి విధానాలను పోలీసు అధికారులు ఎలా నియంత్రిస్తారో వేచిచూడాల్సిందే.

ఇది చదవండి: ఎస్కార్ట్‌ లేకుండానే ఈవీఎంల తరలింపు.. అడ్డుకున్న గ్రామస్తులు

మరిన్ని వార్తలు