అన్నదాతల్లో కలవరం

22 Nov, 2023 00:26 IST|Sakshi

ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో మారిన వాతావరణం అన్నదాతను కలవరపెడుతోంది. బంగా ళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వర్షపు జల్లులు కురిశాయి. ప్రస్తుత వానాకాలంలో సాగుచేసిన వరి, పత్తి పంటలు చేతికందుతున్నాయి. జిల్లాలో 2.70 లక్షల ఎకరాల్లో వరి, 1.85 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. వరి కోతలు ముమ్మరంగా సాగుతుండగా, రైతులు ధాన్యాన్ని ఆరబెట్టడంలో నిమగ్నమయ్యారు. పగలంతా ధాన్యాన్ని ఆరబెట్టడం, రాత్రి వేళల్లో రాశులుగా చేసి టార్పాలిన్లను కప్పి ఉంచుతున్నారు. మరోపక్క పత్తితీత పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పుడు వర్షం కురుస్తుండడం, వాతావరణంలో మార్పులు వస్తుండడంతో పత్తి నాణ్యత కోల్పోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు దిగుబడి లేక, మరో వైపు మద్దతు ధర దక్కని పరిస్థితుల్లో వర్షం కురిస్తే మరింత నష్టపోతామని చెబుతున్నారు. కాగా, జిల్లా వ్యవసాయ వాతావరణ విభాగం, వైరా కేవీకే అధికారులు మరో నాలుగురోజుల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఈనేపథ్యాన రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మారుతున్న వాతావరణంతో దిగులు

మరిన్ని వార్తలు