పీఎం కిసాన్‌కు దూరం

27 Mar, 2023 01:22 IST|Sakshi
కృష్ణాలో సాగు చేసిన వరి

చెరువులో పడ్డ ట్రాక్టర్‌

అమరచింత: చెరుకు లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి ఆత్మకూర్‌ పరమేశ్వరస్వామి చెరువులో పడింది. మస్తీపురం నుంచి చెరుకులోడ్‌తో కృష్ణవేణి షుగర్‌ ఫ్యాక్టరీకి ట్రాక్టర్‌ డ్రైవర్‌ శివారెడ్డి బయలుదేరాడు. ఆదివారం తెల్లవారుజామున ఆత్మకూర్‌ పరమేశ్వరస్వామి చెరువు కట్టపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వాహనం తప్పించబోయి అదుపుతప్పి ట్రాక్టర్‌తో సహా చెరువులో పడ్డాడు. స్వల్ప గాయంతో డ్రైవర్‌ ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. సంఘటన స్థలానికి ఏఎస్‌ఐ బీచుపల్లయ్య చేరుకుని క్రేన్‌ సాయంతో ట్రాక్టర్‌, ట్రాలీని బయటకు తీశారు.

యువకుడిపై కేసు

భూత్పూర్‌: మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్‌కు చెందిన నందిని(19) శనివారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. ఈమె ఇదే గ్రామానికి చెందిన సాబేర్‌ను రెండేళ్లుగా ప్రేమించింది. పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. సోదరుడు జగదీష్‌ ఫిర్యాదు మేరకు ఆత్మహత్యకు కారణమైన ఎండి సాబేర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఏటా తగ్గుతున్న లబ్ధిదారుల సంఖ్య

మొదటి విడతలో

99,998 లబ్ధిదారులు

13వ విడతలో 76,054 లబ్ధిదారులు

జిల్లాలో దాదాపు 30వేల మంది

కొత్త పట్టాపాసుపుస్తకాలు

అర్హులందరికీ అందుతాయి..

కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం కిసాన్‌ అర్హులందరికీ నిబంధనల మేరకు అందుతుంది. ప్రతి ఏడాది మూడు విడతలుగా ఒక్కొక్కరికీ రూ.2వేల చొప్పున వారి ఖాతాలో నేరుగా జమ అవుతున్నాయి. 13వ విడతలో 76,054 మంది రైతులకు పీఎం కిసాన్‌ డబ్బులు జమ అవుతున్నాయి.

– జాన్‌ సుధాకర్‌, డీఏఓ, నారాయణపేట

నారాయణపేట: కేంద్ర ప్రభుత్వం 2018 ఫిబ్రవరి 1న పీఎం కిసాన్‌ యోజనను ప్రవేశపెట్టి ఇప్పటివరకు 13 దఫాలుగా రైతులకు సాయం అందిస్తూవస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పీఎం కిసాన్‌ యోజనలో ఏటా లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రైతుబంధు పథకం మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఏటా ఎకరానికి రూ.2వేల చొప్పున మూడు విడతల్లో రూ.6వేలు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.

ని‘బంధన’లు..

కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పీఎం కిసాన్‌ నిధులు జమ చేయడంలో ప్రభుత్వం కొన్ని ని‘బంధన’లు పెట్టింది. బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం లేని రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం లేదు. ఆదాయం పన్ను చెల్లించే వారిని పథకంలో నుంచి తొలగించారు. రేషన్‌కార్డు ఆధారంగా కుటుంబంలో ఒక్కరికే పథకాన్ని అమలుచేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, లాయర్లు, డాక్టర్లు, ప్రజాప్రతినిధులు నెలకు రూ.10వేల కంటే అధికంగా పింఛను తీసుకునేవాళ్లని క్రమంగా తొలగిస్తున్నారు. నిబంధనలతో అనర్హులను గుర్తిస్తూ పథకం నుంచి తొలగిస్తుండడంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గుతోందని అధికారులు అంటున్నారు.

ఈకేవైసీ చేసుకోక..

పలువురు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంలో అసలు మతలబు గుర్తించడం లేదు. జిల్లా వ్యవసాయశాఖ అధికార యంత్రాంగం అర్హులైన రైతులు ఈకేవైసీ చేసుకోవాలని సూచిస్తూవచ్చింది. రైతులు కొంతమంది పట్టించుకోకపోవడం.. మరోవైపు అవగాహన లేకపోవడంతో ఈకేవైసీ చేసుకోలేకపోతున్నారు. 11వ విడతలో లబ్ధిదారులు 85,641 మంది ఉండగా 12 విడత వచ్చే సరికి 76,054 మందికి చేరుకుంది. 13వ విడతలో సైతం 76,054 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 9,587 మంది రైతులు ఇంకా ఈకేవైసీ చేసుకోలేకపోవడంతోనే వారి ఖాతాల్లో డబ్బులు జమకావడం లేదనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా పట్టాపాసుపుస్తకం ఉన్న ప్రతి రైతుకు కాకుండా కొన్ని నిబంధనల మేరకు పీఎం కిసాన్‌ నిధులు జమ అవుతున్నాయి. ఈకేవైసీ చేసుకోవడంతో నిబంధన ప్రకారంగా అనర్హుల సంఖ్య మాత్రమే తగ్గిందని అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో 13 విడతల్లో పీఎం కిసాన్‌ లబ్ధిదారుల వివరాలు

విడత లబ్ధిదారులు అమౌంట్‌

మొదటి విడత 99,998 రూ.19,99,96,000

రెండో విడత 99,323 రూ.19,86,46,000

మూడో విడత 97,697 రూ.19,53,94,000

నాలుగో విడత 95,874 రూ.19,17,48,000

ఐదవ విడత 94,454 రూ.18,89,08,000

ఆరో విడత 94,350 రూ.18,87,00,000

ఏడవ విడత 92,700 రూ.18,54,00,000

ఎనిమిదో విడత 91,336 రూ.18,26,72,000

తొమ్మిదో విడత 90,108 రూ.18,02,16,000

పదో విడత 89,550 రూ.17,91,00,000

పదకొండో విడత 85,641 రూ.17,12,82,000

పన్నెండో విడత 76,054 రూ.15,21,08,000

పదమూడో విడత 76,054 రూ.15,21,08,000

కొత్త పట్టాపాసు పుస్తకాలకు నిరాశే..

జిల్లాలో దాదాపు 30వేల మంది రైతులు పొలాల క్రయవిక్రయాలు, వారసత్వం తదితర వాటితో కొత్తగా వచ్చిన పట్టాపాసు పుస్తకాల రైతులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రజాప్రతినిధులు ఈ విషయంపై దృష్టి సారించి, సమస్యను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి మేలు చేయాలని రైతులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 5వేల మంది రైతులు మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ రైతు కుటుంబాలకు సంబంధించి విరాసత్‌ చేసుకున్న రైతులకు కొత్త పట్టాపాసు పుస్తకాలు వచ్చాయి. వారికి సైతం ఈ పథకం అమలుకావడం లేదని తెలుస్తోంది.

ఏటా తగ్గుతున్న లబ్ధిదారులు

పట్టాదారుల పాసుపుసక్తం పొందిన రైతుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో చేర్చకపోవడం, నిబంధనల మేరకు కొంతమంది రైతుల పేర్లను తొలగించడంతో పీఎం కిసాన్‌ యోజన కింద సాయంపొందే రైతుల సంఖ్య తగ్గుతుంది. జిల్లాలో రైతులకు పీఎం కిసాన్‌ యోజన కింద మొదటి విడతలో 99,998 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికీ రూ.2 వేల చొప్పున రూ.19, 99,96,000 జమ అయ్యా యి. అయితే ఏటా తగ్గుతూ వస్తుండడంతో 13వ విడత వచ్చే సరికి 76,054 మంది లబ్ధిదారులకు రూ.15,21,08,000 జమ అవుతున్నాయి.

మరిన్ని వార్తలు