విషాదం: కరోనాతో ప్రముఖ నటుడి కన్నుమూత

13 Apr, 2021 13:33 IST|Sakshi

‘కోర్టు’ నటుడు  కన్నుమూత

కరోనా సంబంధిత సమస‍్యలతో మరణించిన వీరా సతీదార్‌

దర్శకుడు చైతన్య తమ్హానే సంతాపం

సాక్షి, ముంబై: కోవిడ్-19 మహమ్మారి మరో నటుడిని బలి తీసుకుంది. జాతీయ అవార్డు మూవీ ‘కోర్టు’ నటుడు వీరా సతీదార్ (60) కరోనా సంబంధిత సమస్యలతో కన్నుమూశారు. ఇటీవల కరోనా వైరస్‌ ‌బారిన పడిన ఆయన గత రెండు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. అయినా పరిస్థితి మెరుగుకాకపోవడంతో తుదిశ్వాస విడిచారని రచయిత, దర్శకుడు చైతన్య తమ్హానే ప్రకటించారు. ఇది చాలా దురదృష్టకరమైన వార్త. ఈ విషాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నానంటూ సతీదార్‌ మరణంపై ఆయన సంతాపం తెలిపారు. అలాగే పలువురు ఉద్యమ కార్యకర్తలు, ఇతర సినీ రంగ ప్రముఖులు సంతాపం  కూడా సతీదార్‌ ఆకస్మికమరణంపైవిచారం వ్యక్తం చేశారు.

కాగా  చైతన్య దర్శకత్వంలో వచ్చిన ‘కోర్టు’  మూవీలో కవి, ఉద్యమకారుడు నారాయణ కాంబ్లే పాత్రలో సతీదార్‌ పలువురి ప్రశంసలందుకున్నారు. జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచిన ఈ  చిత్రం పలు కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకుంది. అలాగే అస్కార్‌ అవార్డుల బరిలో కూడా ఎంట్రీ ఇచ్చింది. సతీదార్ మహారాష్ట్రలోని అంబేడ్కర్‌ ఉద్యమంలో కీలక నేతగా ఉన్నారు .అలాగే ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ కన్వీనర్‌గా సతీదార్ కొనసాగుతున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు