విజయ్‌ ఆంటోనితో నాకు ఎలాంటి సంబంధం లేదు: హీరోయిన్‌

10 Dec, 2023 06:56 IST|Sakshi

కోలీవుడ్‌లో నటి అనూయకు మంచి గుర్తింపే ఉంది. 'శివ మనసుల శక్తి' చిత్రంలో నటుడు జీవాతో జత కట్టి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత ఒరుకల్‌ఒరు కన్నాడి, మదురై సంభవం, నన్బన్‌ తదితర చిత్రాల్లో నటించింది. తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌-1లో కూడా అడుగుపెట్టింది. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఈ భామ ఐటెం సాంగ్స్‌లోనూ నటించడానికి వెనుకాడ లేదు. అయితే అలా శృంగార తారగా అందాలు ఆరబోసిన అవకాశాలు లేకపోవడంతో ఈమె పూర్తిగా తెరమరుగయ్యారనే చెప్పాలి.

అయితే తరచూ తన గ్లామరస్‌ ఫొటోలతో సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తూ తన అభిమానులను ఎంటర్‌టైన్‌మెంట్‌ చేస్తోంది. కాగా ఇటీవల తన ఇన్‌ స్ట్రాగామ్‌ అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భాన్ని అనూయ పేర్కొంటూ తాను దుబాయ్‌లో పుట్టి పెరిగానని చెప్పింది. ఇంజనీరింగ్‌ పూర్తి చేశానని, కాగా తనకు సంబంధం లేకపోయినా నటుడు విజయ్‌ ఆంటోని, సుందర్‌ సి, జీవాతో తనను కలుపుతూ వదంతులు ప్రచారం చేశారని చెప్పింది. తాను ఎవరితోనూ రిలేషన్‌షిప్‌లో లేకున్నా ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది.

అలాంటి ప్రచారాలు అన్నీ అవాస్తవాలు కావడంతో తాను పెద్దగా పట్టించుకోలేదని పేర్కొంది. తాను ఇప్పటికీ సింగిల్‌ గానే ఉన్నానని తెలిపింది. దీంతో ఎందుకు ఒంటరిగా ఉన్నారు? పెళ్లి చేసుకోవచ్చుగా అన్న ఒక అభిమాని ప్రశ్నకు అనూయ బదిలీస్తూ తన చుట్టూ మంచి మగవాళ్లెవరూ లేరని చెప్పింది. దీంతో అనూయ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా ట్రోలింగ్‌ చేస్తున్నారు. అనూయ హీరో విజయ్‌ చిత్రం అయిన స్నేహితుడులో నటించింది. ఆ చిత్రంలో వారి ప్రొఫెసర్‌ పాత్రలో కనిపించిన సత్యరాజ్‌కు కూతురిగా ఆమె మెప్పించింది. 

>
మరిన్ని వార్తలు