-

జాతీయ స్థాయిలో సత్తా చాటిన సినీ నటి ప్రగతి

28 Nov, 2023 16:20 IST|Sakshi

టాలీవుడ్‌లో యంగ్‌ హీరోలకు తల్లి పాత్రలో ఎవరు సెట్‌ అవుతారు అని అడిగితే టక్కున గుర్తుకు వచ్చే పేరు ప్రగతి. ఇండస్ట్రీలో మొదట హీరోయిన్‌గానే ఆమె జర్నీ ప్రారంభమైంది. హీరోయిన్‌గా భారీగా అవకాశాలు వస్తున్నప్పుడు సినిమాలకు కొన్నేళ్ల పాటు బ్రేక్‌ ఇచ్చారు ప్రగతి.  ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో హీరో, హీరోయిన్లకు త‌ల్లి, వ‌దిన‌ పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. కానీ ఇప్పుడు సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ప్రగతి ట్రెండింగ్‌లో ఉన్నారు. ముఖ్యంగా ఆమె ఫిట్‌నెస్, వెయిట్ లిఫ్టింగ్ వీడియోలు చూసిన యంగ్‌స్టర్స్‌ ఆశ్చర్యపోతున్నారు.

(ఇదీ చదవండి: చిరంజీవి పార్టీ పెట్టి వేల కోట్లు తిన్నాడు..మన్సూర్‌ సంచలన వాఖ్యలు!)

ప్రస్తుతం 48 ఏళ్ల వయసుకు రీచ్‌ అయిపోయిన ప్రగతి జిమ్‌లో సుమారు 80 కేజీల బరువును కూడా సునాయసంగా ఎత్తి పక్కనపడేస్తుంది. సినిమాలో చాలా సాఫ్ట్‌గా కనిపించే ప్రగతి రియల్‌ లైఫ్‌లో ఇంత హార్డ్ కోర్ వెయిట్ లిఫ్టర్‌గా చూసి ఆడియన్స్ కూడా అవాక్కయిన సందర్భాలు చాలా ఉన్నాయి.  తాజాగా బెంగళూరులో 28వ బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ జరిగింది. జాతీయ స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో సినీ నటి ప్రగతి కూడా పాల్గొన్నారు.

ఈ పోటీల్లో ప్రొఫెషనల్‌గా ట్రైన్‌ అయిన వారు బరిలో ఉన్నారు. అయినప్పటికీ ప్రగతి ఏ మాత్రం తగ్గకుండా వారికి గట్టిపోటీని ఇచ్చారు. ఈ పోటీలో ఏకంగా మూడో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాంస్య పతకం సాధించి తన సత్తా ఎంటో అందరికీ చాటి చెప్పారు. బెంగళూరులోని ఇంజినీర్స్ అసోసియేషన్ ఆడిటోరియం వేదికగా ఈ పోటీలు జరిగాయి. ప్రొఫెషనల్ పవర్ లిఫ్టర్లతో పోటీ పడి ప్రగతి ఈ పతకం సాధించడం తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంతో గర్వకారణం అని చెప్పవచ్చు. ఛాంపియన్‌ అంటూ ఫ్యాన్స్‌ ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.

A post shared by Pragathi Mahavadi (@pragstrong)

మరిన్ని వార్తలు