జూనియర్‌ సౌందర్యగా గుర్తింపు తెచ్చుకున్న ఈ క్యూట్‌ బేబీని గుర్తుపట్టారా?

10 Oct, 2023 09:32 IST|Sakshi

సినీ హీరో హీరోయిన్ల పర్సనల్​ విషయాలపై అభిమానులకు చాలా ఆసక్తి ఉంటుంది. వాళ్లకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి నెట్టింట్లో తెగ వెతుకుతారు. అలానే హీరో, హీరోయిన్లకు సంబంధించిన చిన్నప్పటి ఫొటోలు కూడా తెగ వైరల్​ అవుతాయి. ఈ ఫోటోలో ఉన్న  చిన్నారి ఒకప్పుడు  టాలీవుడ్​లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది​. తాజాగా ఓ క్యూట్‌ బేబీ ఫొటో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?

సినిమా హీరోయిన్ అంటే స్కిన్ షో చేయాల్సిందే అన్నది చాలామందికి ఉన్న అభిప్రాయం. అందులో కొంత వాస్తవం కూడా ఉంది. కానీ వెండితెరపై ఎలాంటి ఎక్స్​పోజింగ్ చేయకుండానే స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారి చర్చరాగానే మొదట సావిత్రి, సౌందర్య వంటి తారలు గుర్తుకు రావడం సహజం. ఈ జాబితాలో మరో భామ కూడా చేరుతుంది.

ఆమె ఎవరో కాదు స్నేహ.. ఈ ఫోటోలో క్యూట్‌గా ఉన్నది జూనియర్ సౌందర్యగా పిలుచుకునే స్నేహనే..  తెలుగులో స్నేహ ‘తొలివలపు’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చినా.. తరుణ్‌తో కలిసి ‘ప్రియమైన నీకు’ సినిమాతో ఆమెకు స్టార్ ఇమేజ్ వచ్చింది. ప్రస్తుతం విజయ్‌ 68వ చిత్రంలో స్నేహ ఒక కీలకపాత్రలో నటించనుంది.

మరిన్ని వార్తలు