వాట్‌ ఏ క్రియేటివీ అదాశర్మ... వీడియో వైరల్‌

9 May, 2021 12:12 IST|Sakshi

‘హార్ట్‌ ఎటాక్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్‌ అదాశర్మ. ఆ మూవీ తర్వాత ఈ అందాల భామకు టాలీవుడ్‌లో ఎక్కువ అవకాశాలు రాలేదు. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్‌, వెబ్‌ సిరీస్‌లపై ఫోకస్‌ పెట్టింది. ఇక సినిమాల కంటే సోషల్‌ మీడియా ద్వారా ఎక్కువ మంది అభిమానులను సంపాంధించుకుంటుంది అందాల ముద్దుగుమ్మ అదా శర్మ. నిత్యం కొత్త కొత్త స్టైల్లో రెడీ అయి ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులకు కిక్కెక్కిస్తోంది. వింత వింత విన్యాసాలు చేస్తూ ఎల్లప్పుడూ వార్తల్లో నిలుస్తుంది.

తాజాగా మదర్స్‌డే సందర్భంగా అదా శర్మ షేర్‌ చేసిన  ఓ డాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ‘అదా శర్మ ప్రతి విజయం వెనుక అమ్మ ఉంటుంది’అంటూ ఆ వీడియోని షేర్‌ చేసింది అదా శర్మ. అందులో ఆదా తల్లితో కలిసి ఓ హింది పాటకి డాన్స్‌ చేసింది. అయితే వీడియో ఎండింగ్‌ వరకు ఆమె వెనుక తల్లి ఉందన్న విషయం బయటపడదు. తన తల్లితో కలిసి చేసిన ఈ డాన్స్‌ విన్యాసం నెటిజన్లు తెగ ఆకట్టుకుంటుంది. అదా క్రియేటివిటీకి అభిమానులంతా ఫిదా అవుతున్నారు. 

A post shared by Adah Sharma (@adah_ki_adah)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు