Cobra Lyrical Song: అదీరా లిరికల్‌ సాంగ్‌ విడుదల

19 Jul, 2022 09:05 IST|Sakshi

విక్రమ్‌ హీరోగా రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కోబ్రా’. ఇందులో గణితశాస్త్ర మేధావి పాత్రలో కనిపిస్తారు విక్రమ్‌. ఆర్‌. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి ‘అదీరా...’ అనే పాట లిరికల్‌ వీడియాను విడుదల చేశారు. హీరో పాత్ర లక్షణాలను వర్ణిస్తూ ఈ పాట సాగుతుంది. ఏఆర్‌ రెహమాన్‌ స్వరపరిచిన ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యం అందించగా, హరిప్రియ, నకుల్‌ అభ్యంగర్‌ ఆలపించారు.

శ్రీనిధి శెట్టి కథానాయికగా నటింన ఈ చిత్రంలో క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కీలక పాత్ర చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఎన్వీ ప్రసాద్‌ రిలీజ్‌ చేయనున్నారు. ఆగస్ట్‌ 11న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
 

మరిన్ని వార్తలు