బిగ్‌ బాస్‌: బాత్రూంలో లేడీ కంటెస్టెట్స్‌.. హౌస్‌లో ఆమె పనులన్నీ తేడానే!

18 Nov, 2023 13:30 IST|Sakshi

కోలీవుడ్‌లో  బిగ్ బాస్ సీజన్‌ 7 ప్రారంభం అయింది. ఇప్పటికే సుమారు 40 రోజులు దాటింది. అక్కడ కమల్‌ హాసన్‌ హోస్ట్‌గా ఉన్నారు. ఈ సీజన్‌లో కమల్‌ విక్రమ్‌ సినిమాలో సౌండ్‌ బోట్‌ బ్యూటీగా గుర్తింపు పొందిన మాయ కూడా కంటెస్టెంట్‌గా ఉంది. హౌస్‌లో ఆమె ఆటతీరుపై పలు విమర్శలు వచ్చినా గేమ్స్‌లలో బలంగా పోటీపడుతుంది. తాజాగా మాయపై సింగర్‌ సుచిత్ర వైరల్‌ కామెంట్‌ చేసింది. మాయ ఒక లెస్బియన్‌ అని పేర్కొంది. దీనికి ప్రధాన కారణం బిగ్ బాస్ హౌస్‌లో మహిళా కంటెస్టెంట్‌తో కలిసి అదే బాత్రూంలోకి వెళ్లిన వీడియో సోషల్‌ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. 

ఈ వారం బిగ్‌బాస్‌ హౌస్‌ కెప్టెన్‌గా ఉన్న మాయ మరో కంటెస్టెంట్‌ అయిన  ఐషుతో కలిసి బాత్రూంలోకి వెళ్లింది. ఆ సన్నివేశాలు విడుదలయ్యాయి. బిగ్ బాస్ నిబంధనల ప్రకారం చర్చ సమయంలో పోటీదారులు తప్పనిసరిగా మైక్ ఆన్‌లో ఉంచాలి. మీరు బాత్రూమ్‌కి వెళ్లినప్పుడు మాత్రమే మైక్ తీయగలరు. దీనిని వారు అడ్వాంటేజ్‌ తీసుకున్నారు. మైక్ తీసి ఒకే బాత్రూంలోకి వెళ్లి ఏదో మాట్లాడుకోవడానికి దీన్ని ఉపయోగించినట్లు కనిపిస్తోంది. కానీ బాత్రూమ్‌లోకి ఒకరు మాత్రమే వెళ్లాలి అనే రూల్‌ కూడా ఉంది.

'ఆమెకు పురుషులు అంటే ఇష్టం ఉండదు'
ఇదే విషయం గురించి తమిళ నటుడు రంగనాథన్‌ సాకింగ్‌ సమాచారం ఇచ్చాడు..  హౌస్‌లో మాయ మాత్రమే కాదు, తమిళ సినిమాలో చాలా మంది లెస్బియన్స్ ఉన్నారని ఆయన కామెంట్‌ చేశారు. బిగ్ బాస్ హౌస్‌లో మాయ, పూర్ణిమ మరింత దగ్గరవుతున్నారని ఆయన తెలిపారు. ఆమె  పూర్ణిమపై ప్రేమను కలిగి ఉన్నట్లు సందేహాలు వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు.

ఆమె (మాయ) ఒక లెస్బియన్ అని ఇద్దరు ముగ్గురు నటీమణులు నాకు చెప్పారు. మాయ ట్రాన్స్‌జెండర్ కాకపోవడంతో ట్రాన్స్‌జెండర్‌ లిస్ట్‌లోనే ఆమె బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించింది. అందుకే ఆమెను ఎంపిక చేశారు. హౌస్‌లో మాయ చేస్తున్న పనులు, అలవాట్లున్నీ లెస్బియన్‌ మాదిరే ఉంటున్నాయి. వారు పురుషులను అస్సలు ఇష్టపడరు. సినిమాల్లో కూడా చాలా మంది లెస్బియన్స్‌ ఉన్నారు.  కానీ, ఈ విషయం బయటకి తెలిస్తే  పరువు పోతుందని దాస్తున్నారు. అని ఆయన పేర్కొన్నారు.

నాతో రిలేషన్‌ పెట్టుకుంది: అనన్య
మాయా కృష్ణన్ తనను లైంగికంగా, మానసికంగా వేధింపులకి పాల్పడినట్లు కోలివుడ్‌ నటి అనన్య రామ్ ప్రసాద్ గతంలో ఆరోపించింది. ''నటి మాయ కృష్ణన్ నా జీవితాన్ని సర్వ నాశనం చేసింది. ఆమె కారణంగా నా కుటుంబానికి, స్నేహితులకి దూరమయ్యాను. ఆమె వలన లైంగిక వేధింపులు ఎదుర్కోవడంతో మానసికంగా కృంగిపోయాను. నన్ను వేధించింది ఒక మగాడు అయి ఉంటే ఈ విషయం చెప్పడానికి ఇంతగా ఇబ్బంది పడేదాన్ని కాదు. కానీ ఓ మహిళ కారణంగా చేదు అనుభవాలు ఎదుర్కొన్నాను. 2016 లో నాకు మాయ కృష్ణన్ తో పరిచయం ఏర్పడింది. నాకు 18 ఏళ్ల వయసున్నప్పుడు ఆమెకి 25.. ఆ సమయంలో నన్ను లొంగదీసుకొని నాతో శారీరక సంబంధం పెట్టుకుంది. ఈ ఆరోపణపై మాయ కూడా అప్పట్లో రియాక్ట్‌ అయింది. అనన్య చెబుతున్న దాంట్లో నిజం లేదని .. కావాలనే తనపై కక్షగట్టి ఇలాంటి ఆరోపణలు చేస్తుందని పేర్కొంది.

మరిన్ని వార్తలు