‘అలవైకుంఠపురంలో' హిందీ రీమేక్‌ టైటిల్‌ ఇదే..

22 Jun, 2021 21:36 IST|Sakshi

అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అలవైకుంఠపురంలో'. గతేడాది సంక్రాంతి బరిలో నిలిచిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రాన్ని ప్రస్తుతం బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.  తెలుగులో త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హిందీలో డేవిడ్ ధావన్ తెరకెక్కించనున్నారు. కార్తీక్‌ ఆర్యన్‌, కృతిసనన్‌లు హీరో, హీరోయిన్లుగా నటించనున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి “షెహజాదా అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఏక్తా కపూర్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో టబు పాత్రలో బాలీవుడ్‌ నటి మనీషా కొయిరాల నటించనున్న సంగతి తెలిసిందే. ముందుగా ఈ పాత్ర కోసం టబునే సంప్రదించినా ఆమె డేట్స్‌ ఖాళీ లేకపోవడంతో ఆ ఛాన్స్‌ మనీషా కొయిరాలకు దక్కినట్లు తెలుస్తోంది. ఇక తెలుగులో మురళీశర్మ పోషించిన పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావల్ కనిపించనున్నారు.

చదవండి : తల్లి పాత్రలో అందాల నటి మనీషా కొయిరాల
అల్లు అర్జున్‌ పాటకు స్టెప్పులేసిన బాలీవుడ్‌ యంగ్‌ హీరో

మరిన్ని వార్తలు