Junior NTR:ఎన్టీఆర్‌కు ఆలియాభట్ సర్‌ప్రైజ్‌.. అదేంటో తెలుసా?

26 Mar, 2023 08:26 IST|Sakshi

జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ నటించిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. తాజాగా ఆమె ఎన్టీఆర్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఎన్టీఆర్‌ కుమారులు అభయ్‌, భార్గవకు కొత్త దుస్తులు పంపి తన అభిమానాన్ని చాటుకుంది. యూ ఆర్ మై ఫేవరెట్ హ్యూమన్ బీన్ అనే బ్యాగ్‌లో ప్యాక్ చేసి.. పిల్లల పేర్లతో ట్యాగ్‌లు పెట్టి మరీ పంపించింది. ఆలియా భట్‌ బహుమానానికి ఎన్టీఆర్ ఫిదా అయిపోయారు. త్వరలోనే నా పేరుతో మీరు ఓ బ్యాగ్ చూస్తారు అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు యంగ్ టైగర్. 


కాగా.. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్‌ ఎన్టీఆర్‌ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు తాత్కాలికంగా ఎన్టీఆర్‌30 పేరు పెట్టారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 

మరిన్ని వార్తలు