రణ్‌బీర్‌కు ఆల్రెడీ చెప్పా.. అందుకు ఒప్పుకోకపోతే అప్‌సెట్ అవుతా: ఆలియా

25 Jul, 2022 21:40 IST|Sakshi

బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ సోమవారం ఓ ఆసక్తి విషయాన్ని వెల్లడించింది. తన భర్త రణ్‌బీర్ కపూర్‌ దర్శకత్వం వహించబోయే సినిమాకు తానే నిర్మాతగా ఉంటానని చెప్పింది. ఒకవేళ అందుకు రణ్‌బీర్ ఒప్పుకోకపోతే అప్‌సెట్ అవుతానని పేర్కొంది. ఈవిషయంపై ఇప్పటికే తన భర్తతో చర్చించినట్లు తెలిపింది.

ఆలియా భట్ నటిస్తూ తొలిసారి నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం డార్లింగ్. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగానే మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆలియా బదులిచ్చింది. తాను దర్శకత్వం విభాగంలో అరంగేట్రం చేయాలనుకుంటున్నట్లు, కరోనా టైంలోనే కథ కూడా సిద్ధం చేసుకున్నట్లు రణ్‌బీర్ ఇటీవల షంషేరా మూవీ ప్రమోషన్స్‌ సందర్భంగా వెల్లడించాడు. రచయితలను సంప్రదించి కథకు మెరుగులు దిద్దాలనుకుంటున్నట్లు చెప్పాడు.

ఈ నేపథ్యంలోనే రణ్‌బీర్ దర్శకత్వం వహించబోయే సినిమాలో మీరు ఉంటారా? అని ఆలియాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అందుకు ఆమె బదులిస్తూ.. ఈ విషయంపై రణ్‌బీర్‌తో ఇంతకుముందే మాట్లాడానని, నటిగా కాకపోయినా నిర్మాతగానైనా అవకాశం ఇవ్వాలని కోరినట్లు చెప్పింది. అందుకు రణ్‌బీర్ కూడా ఒప్పుకున్నాడని చెప్పుకొచ్చింది.
చదవండి: ‘గాడ్‌ ఫాదర్‌’లో నన్ను కాదని సల్మాన్‌ను ఎందుకు తీసుకున్నారు’ చిరును ప్రశ్నించిన ఆమిర్‌

మరిన్ని వార్తలు