నన్ను దారుణంగా తిడుతున్నారు..

3 Dec, 2020 17:00 IST|Sakshi

ముంబై: ఇటీవల సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న విమర్శక పోస్టులు తనకు ప్రేరణనిస్తున్నాయని బాలీవుడ్‌ భామ అలియా భట్‌ అన్నారు. ప్రముఖ దర్శకుడు మహేష్‌ భట్‌ ముద్దుల తనయగా బాలీవుడ్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అలియా.. తను నటించిన ‘రాజీ’, ‘2 స్టేట్స్‌’, ‘గల్లీభాయ్‌’ వంటి చిత్రాలతో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో అలియా ఇటీవల ఓ బట్టల వ్యాపారాన్ని కూడా ప్రారంభించారు. ఇటూ నటిగా, అటూ వ్యాపారవేత్తగా బిజీగా ఉన్న అలియా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యాపారం గురించి మాట్లాడారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న విమర్శలపై కూడా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. (చదవండి: అలియాకు షాక్‌.. డిస్‌లైక్‌ల వరద)

‘ఇటీవల కాలంలో నన్ను నెటిజన్‌లు వీపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. ప్రతి రోజు సోషల్‌ మీడియాలో విద్వేషపూరితమైన వ్యాఖ్యలను ఎదుర్కొంటున్నాను. అది మాత్రమే కాకుండా నన్ను తిడుతూ దారుణమైన పోస్టులు పెడుతున్నారు’ అని పేర్కొన్నారు. అయితే వాటి ప్రభావం తనపై ఏమాత్రం పడలేదన్నారు. చేప్పాలంటే ప్రతీ పోస్టు తనకు ప్రేరణగా నిలుస్తున్నాయని చెప్పారు. ‘‘ప్రస్తుతం నేను ఎదుర్కొంటున్న అనుభవాలు నాకు ఎన్నో విషయాలను నేర్పాయి. అవి చూశాక ఎదుటి వ్యక్తితో దయతో వ్యవహరించాలనే విషయాన్ని గ్రహించాను. అంతేకాదు మనం నివసిస్తున్న భూమి పట్ల కూడా ప్రేమగా వ్యవహరించాలని అర్థమైంది’’ అని చెప్పకొచ్చారు. అయితే దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్‌ బంధుప్రీతి(నెపోటిజం)పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. (చదవండి: చెత్త సినిమా, 1 స్టార్‌ రేటింగే ఎక్కువ‌!)

బాలీవుడ్‌లో స్టార్‌ కిడ్స్‌కు మాత్రమే అవకాశాలు ఇస్తారని, బయట వ్యక్తులను తొక్కెస్తారంటూ నిర్మాత కరణ్‌ జోహార్‌, దర్శక, నిర్మాత మహేష్‌ భట్‌తో పాటు ఇతరులుపై సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్‌లు‌ ధ్వజమెత్తారు. ఈ క్రమంలో అలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌లతో పాటు స్టార్‌ కిడ్స్‌ పిల్లలపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇక అలియా భట్‌ అందం, అభినయం, నటన లేకపోయిన బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారని, ఇందుకు మహేష్‌ భట్‌ కూతురు కావడమే ఆమెకు ఉన్న ఎకైక అర్హత అంంటూ ఆమెపై విమర్శ వ్యాఖ్యలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం అలియా తన ప్రియుడు రణ్‌బిర్‌కు జంటగా ‘బ్రహ్మస్త్ర’లో నటిస్తున్నారు. (చదవండి: ప్రియుడి బంగ్లాలో అలియా కొత్త ఇల్లు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా