అల్లు అర్జున్‌ ఇంట్లో రెండు క్యూట్‌ దెయ్యాలు.. వీడియో వైరల్‌

18 Jul, 2021 19:51 IST|Sakshi

అల్లు అర్జున్‌ ఇంట్లో రెండు దెయ్యాలు పడ్డాయి. అవును.. అవి మాములు దెయ్యాలు కావు.. అల్లరి చేసే పిల్ల దెయ్యాలు. ఇళ్లంతా తిరుగుతూ నానా హంగామా చేసే క్యూట్‌ దెయ్యాలు. ఈ పిల్ల దెయ్యాలు ఎవరో కాదు అల్లు అర్జున్‌ పిల్లలు అర్హ, అయాన్‌. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే అల్లు అర్జున్‌ సతీమణి ఈ క్యూట్‌ దెయ్యాల వీడియోని తన ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. 

కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన పిల్లలకు ఉన్నచోటే వినోదాన్ని అందిస్తోంది స్నేహ. పిల్లలకు రకరకాల గెటప్‌ వేసి ఆడిస్తోంది. వాటికి సంబంధిన వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు చేరవేస్తుంది స్నేహ. తాజాగా ఆమె షేర్‌ చేసిన దెయ్యాల వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో తెగవైరల్‌ అవుతోంది. అందులో అర్హ, అయాన్‌లు తెల్లటి వస్త్రాలు ధరించి, దెయ్యాల గెటప్‌లో ఉన్నారు. ముఖాలకు కళ్లద్దాలు పెట్టుకొని క్యూట్‌ డ్యాన్స్‌ చేస్తూ భయపెట్టే ప్రయత్నం చేశారు. . ఇక ఇందులో బుల్లి అర్హ వేసిన చిన్న స్టెప్పులు మాత్రం అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు