Allu Arjun: తహశీల్దార్‌ కార్యాలయానికి అల్లు అర్జున్‌

8 Oct, 2021 12:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పుష్ప సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న స్టైలిష్‌ స్టార్‌ అ‍ల్లు అర్జున్‌ తాజాగా రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో సందడి చేశారు. శంకర్‌పల్లి మండలంలోని  జన్వాడలో బన్నీ రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమి రిజిస్ట్రేషన్‌ నిమిత్తం శుక్రవారం బన్నీ తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లారు. రిజిస్ట్రేషన్‌ పనులు పూర్తి అయిన తరువాత ప్రొసీడింగ్‌ ఆర్డర్‌ను శంకర్‌పల్లి తహశీల్దార్‌ సైదులు బన్నీకి అందజేశారు.
చదవండి: మనసులోని బాధను బయటపెట్టిన సమంత.. పోస్ట్‌ వైరల్‌

అయితే ఎమ్మార్వో కార్యాలయానికి అల్లు అర్జున్‌ వచ్చాడని తెలుసుకున్న అభిమానులు ఆయనను చూసేందుకు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఎమ్మార్వో సిబ్బంది, అభిమానులు బన్నీతో సెల్ఫీలు తీసుకున్నారు.  ఇక రిజిస్ట్రేషన్‌ పూర్తైన వెంటనే ఆయన తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఇదిలా ఉండగా ఇటీవల జూనియర్‌ ఎన్టీఆర్‌ సైతం 6 ఎకరాల భూమి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బన్నీ కూడా అదే శంకరపల్లి మండలంలో భూమిని కొన్నారు.
చదవండి: ‘పుష్ప’లో అదిరిపోయే ఐటెం సాంగ్‌, బాలీవుడ్‌ భామ షాకింగ్‌ రెమ్యూనరేషన్‌!

ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘ఫుష్ప’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.  పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న  ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుంది. ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు