బన్నీ ఫ్యాన్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌.. మెగా ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌!

5 Mar, 2023 12:04 IST|Sakshi

చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పాన్‌ ఇండియా సినిమా ట్రెండ్ నడుస్తోంది. దీంతో ఇండియా వైడ్ హీరోలందరూ తమ మార్కెట్ ను పెంచుకోవటానికి ట్రై చేస్తున్నారు. అందుకే తమ సినిమాల్లో  ఇతర భాషల స్టార్ హీరోస్  ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్‌ హీరోస్ సైతం తమ సినిమాల్లో సౌతిండియా యాక్టర్స్ ఉండేలా చూసుకుంటున్నారు. అంతేకాదు సౌతిండియా స్టార్‌ హీరోస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి ఓ బంపరాఫర్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మిస్ చేసుకున్నాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్ బాగా డిస్పాయింట్ అయ్యారు. 

వివరాల్లోకి వెళితే..  సౌతిండియా డైరెక్టర్ అట్లీ షారుఖ్‌ ఖాన్‌తో ఓ బాలీవుడ్‌ మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ గా నయన తార నటిస్తుంది. విజయ్ సేతుపతి, రానా, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.  సౌతిండియా మార్కెట్ ను క్యాప్చర్ చేసేందుకు షారూఖ్‌... ఈ సినిమా తమిళ్‌ వెర్షన్ లో ఇళయ దళపతి విజయ్‌ ని...తెలుగు వెర్షన్ లో అల్లు అర్జున్ గెస్ట్ రోల్స్ లో కనిపించేలా ప్లాన్ చేశాడు.

 డైరెక్టర్ అట్లీ..బన్నీ ని అప్రోచ్ కూడా అయ్యాడు..ఈ  మూవీ కథ కూడా నేరేట్ చేయడం జరిగింది. ముందు ఇంట్రెస్ట్ చూపించిన బన్నీ...ఇప్పుడు నటించటానికి నో చెప్పాడనే మాట టాలీవుడ్ లో వినిపిస్తోంది.  ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంవలో  పుష్ఫ 2 సినిమాలో నటిస్తున్నాడు. 

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బన్నీ బిజీగా ఉన్నాడు. పుష్ప 2 కోసం గెడ్డం ఉన్న లుక్ ని మెయింటేన్ చేస్తున్నాడు. కానీ జవాన్ లో బన్నీ లుక్ మార్చాల్సి ఉంది. దీంతో జవాన్ లో తన క్యారెక్టర్ నచ్చిన కూడా...లుక్ ఛెంజ్ కావాల్సి ఉండటంతో  డైరెక్టర్ అట్లీకి నో చెప్పినట్లు సమాచారం. 

అయితే ఇప్పుడు మేకర్స్ దృష్టి మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ పై పడింది. ఆస్కార్ అవార్డ్స్ నుంచి చెర్రీ రాగానే అప్రోచ్ అయ్యేందుకు రెడీ ఉన్నారు. కింగ్ ఖాన్ షారూఖ్‌ ఖాన్‌ కి....రామ్ చరణ్‌ కి మధ్య గుడ్ రిలేషన్ ఉంది. కాబట్టి జవాన్ మూవీలో గెస్ట్  రోల్ రిక్వెస్ట్ ను ..యాక్సెప్ట్ చేస్తాడనే ప్రచారం నెట్టింట బాగా సాగుతోంది.  ఈ ఆఫర్ విషయంలో  రామ్‌ చరణ్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అని మెగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌...శంకర్ దర్శకత్వంలో ఆర్‌సీ15లో నటిస్తున్నాడు.

మరిన్ని వార్తలు