సిల్క్ స్మిత బ‌యోపిక్ చేయ‌డం లేదు

9 Dec, 2020 19:56 IST|Sakshi

బుల్లితెర, వెండితెర  ఏదైనా అన‌సూయ‌‌కు కొట్టిన పిండే. యాంక‌ర్‌గా అల‌రిస్తూనే న‌టిగా మెప్పిస్తున్నారు. ఏ పాత్ర ఇచ్చినా అందులో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి దానికి నూటికి నూరు శాతం న్యాయం చేస్తారు. అలా రంగ‌స్థ‌లం సినిమాలో ఆమె చేసిన రంగ‌మ్మ‌త్త పాత్ర ప్రేక్ష‌కుల‌కు విప‌రీతంగా క‌నెక్ట్ అయింది. తాజాగా ఆమె ఓ కొత్త‌ సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెట్ట‌బోతున్నారు. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా వెల్ల‌డించారు. మ‌రో మంచి క‌థ.. కొత్త ఆరంభం, కోలీవుడ్ అనే క్యాప్ష‌న్‌తో అద్దంలో త‌న ముఖాన్ని చూసుకుంటున్న‌ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. అంతా బాగానే ఉంది, కానీ ఆ ఫొటోకు రిఫ‌రెన్స్ సిల్క్ స్మిత‌గారు అని ఆమె పేరును ట్యాగ్ చేశారు. (చ‌ద‌వండి: అనసూయ కోలీవుడ్‌ చిత్రం.. సిల్క్‌ స్మిత బయోపిక్‌!)

దీంతో ఆమె కోలీవుడ్‌లో తెర‌కెక్క‌నున్న సిల్క్ స్మిత బ‌యోపిక్‌లో న‌టించ‌నున్నార‌ని వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఈ బ‌యోపిక్‌ షూటింగ్ కోసం ఆమె చెన్నైకు కూడా వెళ్లొచ్చిన‌ట్లు ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఈ పుకార్ల‌కు అన‌సూయ చెక్ పెట్టారు. సిల్క్ స్మిత బ‌యోపిక్‌లో న‌టించ‌డం లేద‌ని తేల్చి చెప్పారు. ఈ మేర‌కు బుధ‌వారం ట్వీట్ చేశారు. కాగా అన‌సూయ ప్ర‌స్తుతం చిరంజీవి 'ఆచార్య'‌, అల్లు అర్జున్ 'పుష్ప‌' సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. కృష్ణ వంశీ సినిమా 'రంగ‌మార్తాండ'లోనూ ఓ ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టిస్తున్నారు. అంతేకాక ర‌వితేజ 'ఖిలాడీ' చిత్రంలో ప్ర‌ముఖ‌ పాత్ర‌లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డ‌మే కాక స్పెష‌ల్ సాంగ్‌లో హీరోతో క‌లిసి చిందులేయ‌నున్నార‌ట‌. (చ‌ద‌వండి: వెయ్యి మంది... వంద రోజులు!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు