Anchor Suma Kanakala: గిన్నిస్‌ రికార్డు.. ఆయనే నా సూపర్‌ హీరో అంటున్న సుమ

9 Nov, 2023 13:04 IST|Sakshi

ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల సంతోషంలో మునిగితేలుతోంది. ఇంతకీ ఆమె సంతోషానికి కారణం ఎవరనుకుంటున్నారా? ఆమె తాతయ్య పి.బి. మీనన్‌. ఈయన 98 ఏళ్ల వయసులో గిన్నిస్‌ రికార్డు గెలుచుకున్నారు. ఈ విషయాన్ని సుమ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ద్వారా అభిమానులకు వెల్లడించింది. 'మా తాతయ్య(అమ్మమ్మ తమ్ముడు) మీనన్‌ 73 ఏళ్లుగా న్యాయవాదిగా సేవలందిస్తున్నారు. ఎక్కువకాలం న్యాయవాది వృత్తిలో ఉంటూ సేవలందిస్తున్నందుకుగానూ గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించుకున్నారు. ఈయన నాతో పాటు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. మా తాతయ్యే నా సూపర్‌ హీరో' అని రాసుకొచ్చింది.

ఆయన చాలా గ్రేట్‌..
ఇందుకు తన తాత గిన్నిస్‌ రికార్డు అందుకున్న ఫోటోను జత చేసింది. అలాగే గిన్నిస్‌ బుక్‌ వారు అందించిన సర్టిఫికెట్‌ను సైతం జోడించింది. దీనిప్రకారం సుమ తాతయ్య 73 ఏళ్ల 60 రోజులగా న్యాయవాద వృత్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. అన్నేళ్ల పాటు వృత్తిలో కొనసాగడం మామూలు విషయం కాదు, నిజంగా ఆయన చాలా గ్రేట్‌ అని పొగుడుతున్నారు. సుమ కూడా తన యాంకరింగ్‌ను అలాగే కొనసాగించాలని.. భవిష్యత్తులో ఎక్కువకాలం యాంకరింగ్‌ చేసిన హోస్ట్‌గా గిన్నిస్‌ రికార్డు అందుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

తిరుగులేని యాంకర్‌
ఇకపోతే మలయాళీ కుటుంబానికి చెందిన సుమ అచ్చ తెలుగమ్మాయిలా అనర్గళంగా తెలుగు మాట్లాడుతుంది. తన నోటి నుంచి వచ్చే పంచ్‌లకైతే లెక్కే లేదు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే సుమ టాలీవుడ్‌లో యాంకర్‌గా బోలెడంత క్రేజ్‌ తెచ్చుకుంది. పెద్ద సినిమాల ప్రీరిలీజ్‌ ఈవెంట్‌, ఇంటర్వ్యూలకు అయితే సుమ కచ్చితంగా ఉండి తీరాల్సిందే! చాలామటుకు విమర్శలు, వివాదాల జోలికి పోని సుమ ఈ మధ్య ఆదికేశవ పాట లాంచ్‌ ఈవెంట్‌లో మాత్రం నోరు జారింది. 'స్నాక్స్, భోజనంలా చేస్తున్నారు' అంటూ మీడియా వాళ్లపై సెటైర్లు వేసింది. ఈ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో అందరికీ సారీ చెప్పి ఆ వివాదాన్ని సద్దుమణిగేలా చేసింది.

A post shared by Suma Kanakala (@kanakalasuma)

చదవండి: బాలకృష్ణ VS తారక్‌.. పోటీగా దిగుతున్న బాలయ్య.. అప్పటి రిజల్ట్‌ రిపీట్‌ కానుందా?

మరిన్ని వార్తలు