‘తొలి మూవీ తర్వాత కాలేజీలో ఘోర అవమానాలు ఎదుర్కొన్నా’

3 May, 2021 21:43 IST|Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ నిన్నటితో 33వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆదివారం(మే 1) అనుష్క బర్త్‌డే సందర్భంగా ఆమె భర్త, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే సినీ ప్రముఖులు, క్రికెట్‌ ఆటగాళ్లు, ఇతర రంగాల ప్రముఖులు ఆమెకు బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో అనుష్కకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.  

‘రబ్‌ నే బనాదీ జోడీ’  మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అనుష్క తన మొదటి చిత్రంతోనే ఏకంగా సూపర్‌ స్టార్‌ షారుక్‌తో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. ఇక ఆ తర్వాత బీ-టౌన్‌లో అగ్రనటిగా ఎదిగిన ఆమె కాలేజీ సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క తన కాలేజీ రోజులను గుర్తు చేసుకుంది. ఆర్మీ నేపథ్య కుటుంబం నుంచి సినిమాల్లోకి అడుగు పెట్టిన అనుష్క శర్మ తొలుత మోడలింగ్‌లో రాణించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆమెకు రబ్‌ నే బనాదీ జోడీలో నటించే అవకాశం వచ్చిందట. అప్పటికి ఆమెకు కేవలం 18 ఏళ్లు వయసు మాత్రమే కావడంతో తొలి చిత్రం తర్వాత ఆమె​కు రెండేళ్ల గ్యాప్‌ వచ్చింది. ఆ సమయంలోనే తను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చేదు అనుభవాలను పంచుకుంది. ‘నేను కాలేజ్‌లో ఉన్నప్పుడే మోడలింగ్‌‌పై ఆసక్తి ఉండేది. అయితే కాలేజ్‌లో ‘నువ్వు ఏం అంత అందంగా లేవు, కేవలం సన్నగా నాజుగ్గా ఉన్నందువల్లే అవకాశం వచ్చింది తప్ప నీలో పెద్దగా హీరోయిన్‌ ఫీజర్స్‌ లేవంటూ కామెంట్లు చేసేవారు. ఆ మాటలకు నేను చాలా కుమిలిపోయేదాన్ని’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. 

అలాగే ‘సినిమా తర్వాత కూడా ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్‌ అవార్డు దక్కుతుందని భావించి ఆ వేడుకకి వెళితే.. తీరా ఆ అవార్డుకు కూడా నోచుకోలేదు. దాంతో అప్పుడు కూడా కన్నీళ్లు ఆగలేదు. దీంతో వేదిక వెనక్కి వెళ్లి ఏడుస్తుంటే అమితాబ్‌ బచ్చన్‌ వెనుక నుంచి వచ్చి ‘రబ్‌ దే బనాది జోడీ’ చూశా.. అందులో మీ నటన చాలా బాగుందని చెప్పడం చాలా ఆనందాన్నిచ్చింది. ఆయన మాటే అవార్డుగా భావించాను’  అని పేర్కొంది. హీరోయిన్‌గానే కాకుండా నిర్మాతగానూ ప్రేక్షకుల్ని అలరించిన అనుష్క శర్మ.. 2017 డిసెంబరులో విరాట్‌ కోహ్లీని పెళ్లి చేసుకుంది. ఇటీవలే విరుష్కలు వామిక అనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

చదవండి: 
పెళ్లి తర్వాత నటించనన్నావ్‌.. మరి ఇదేంటి?!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు