అన్వేషీజైన్‌.. అందమైన మోటివేషనల్‌ స్పీకర్‌

19 Sep, 2021 12:12 IST|Sakshi

అన్వేషీజైన్‌.. అందంతోనే కాదు, అద్భుతమైన మాటలతో కూడా మాయ చేయగల గ్రేట్‌ మోటివేషనల్‌ స్పీకర్‌. ప్రస్తుతం వరుస వెబ్‌ సిరీస్, సినిమాలతో దూసుకుపోతున్న ఈ యూట్యూబ్‌ స్టార్‌ గురించి..

 అన్వేషీ జైన్‌ జన్మస్థలం మధ్యప్రదేశ్‌లోని ఖజురహో. 

భోపాల్‌లోని రాజీవ్‌గాంధీ టెక్నికల్‌ యూనివర్సిటీలో ఎలాక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ చేసింది. 

 ఓ ప్రైవేట్‌ కంపెనీలో కొంతకాలం పనిచేసి, సొంతంగా  బిజినెస్‌ ప్రారంభించింది. అది కాస్తా నష్టాల్లో పడడంతో ముంబై చేరింది. 

ఆమె అందమైన ముఖం, చక్కని శరీరాకృతి చూసి మోడల్‌గా చాన్స్‌ ఇచ్చింది ముంబైలోని మోడలింగ్‌ ఇండస్ట్రీ. పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది.

మోడల్‌గా వచ్చిన గుర్తింపు బుల్లితెరపై యాంకరింగ్‌ అవకాశాన్ని తెచ్చింది. సుమారు వెయ్యికి పైగా టీవీ, స్టేజ్‌ షోలు, పబ్లిక్‌ ఫంక్షన్లకు యాంకరింగ్‌ చేసింది. 

► ‘అన్వేషీ జైన్‌’ పేరుతో యూట్యూబ్‌ చానెల్‌ ప్రారంభించి పలు వీడియోలు చేసింది. బంధాలు, అనుబంధాల గురించి చెప్పే ఆమె ప్రసంగాలకు ఎంతోమంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అలా మోటివేషనల్‌ స్పీకర్‌గానూ అన్వేషీ చాలా ఫేమస్‌.  

► 2018లో ‘గందీ బాత్‌ 2’ వెబ్‌సిరీస్‌తో వెబ్‌ దునియాలోకీ ఎంటరై మరింత మంది అభిమానులను సంపాదించుకుంది.

 ► 2019లో ఆమెకు రెండు విభాగాల్లో ‘దాదాసాహెబ్‌ ఫాల్కే ఐకాన్‌’ అవార్డు లభించింది. ఒకటి ‘సోషల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’, రెండు ‘పర్సోనా ఆఫ్‌ ది ఇయర్‌’.  

► ప్రస్తుతం త్వరలోనే విడుదల కానున్న ‘జీ’ అనే గుజరాతీ సినిమాలో నటిస్తోంది. 

కాలేజీ రోజుల్లో నా శరీరాకృతి గురించి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నా. ఆ ఆకృతే ఇప్పుడు నా జీవితాన్ని మార్చేసింది.
– అన్వేషీ జైన్‌   

మరిన్ని వార్తలు