Arjun Sarja-Vishswak Sen Movie: అర్జున్‌-విశ్వక్‌ సేన్‌ మూవీకి క్లాప్‌ కొట్టిన పవన్‌ కల్యాణ్‌

23 Jun, 2022 12:33 IST|Sakshi

యాక్షన్‌ హీరో అర్జున్‌ సర్జా దర్శకత్వంలో యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌, ఆయన కూతురు ఐశ్వర్య సర్జా హీరోహీరోయిన్లు ఓ సినిమా రాబోతున్ను సంగతి తెలిసిందే. ప్రొడక్షన్‌ నెం. 15న రాబోయే ఈ సినిమా నేడు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గురువారం(జూన్‌ 23) రామానాయడు స్టూడియోలో ఈ మూవీ పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ కార్యక్రమానికి నటుడు పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా హజరై హీరోహీరోయిన్ల తొలి సీన్‌కు క్లాప్‌ కొట్టాడు.

చదవండి: తన మూవీ డైరెక్టర్‌కు క్షమాపణలు చెప్పిన రామ్‌, ఏం జరిగిందంటే!

ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఈ చిత్రానికి అర్జున్‌ కథా రచయిత, దర్శకత్వంతో పాటు స్వయంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం కాబోతోంది. అర్జున్‌కి మంచి స్నేహితుడైన  జగపతిబాబు ఇందులో కీలకపాత్ర పోషించనున్నాడు.ఈ చిత్రానికి కెజీయఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తారు. 

మరిన్ని వార్తలు