Robo Shankar: మందుకు బానిసై చావు చివరి అంచులదాకా వెళ్లా.. ధనుష్‌ కూడా మద్యం..

14 Nov, 2023 15:09 IST|Sakshi

రోబో శంకర్‌.. స్టాండప్‌ కమెడియన్‌. తమిళంలో అనేక చిత్రాల్లో నటించాడు. మారి సినిమాలోనూ తన యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న ఇతడికి గతంలో ఓ చెడు అలవాటు ఉండేది. సమయం, సందర్భం లేకుండా ఎప్పుడూ మందు తాగుతూ ఉండేవాడు. మద్యానికి బానిసై లేనిపోని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నాడు. దీనికి తోడు ఆ మధ్య ఇతడికి పచ్చకామెర్ల వ్యాధి సోకింది.

ధనుష్‌ కూడా నాలాగే..
దీంతో నాలుగునెలల పాటు మంచానికే పరిమితమయ్యాడు. అప్పుడు జీవితం విలువ తెలుసుకున్నాడు. ప్రస్తుతం మద్యపానానికి దూరంగా ఉంటూ కఠిన ఆహారపు అలవాట్లను అనుసరిస్తూ బక్కచిక్కిపోయాడు. తాజాగా రోబో శంకర్‌ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'మద్యపానం అనే వ్యసనాన్ని కంట్రోల్‌ చేసుకోలేక ఒకానొక సమయంలో ఆత్మహత్యకు ప్రయత్నించాను. అంత పెద్ద తాగుబోతులా తయారయ్యాను. ఎవరి మాటా వినలేదు. హీరో ధనుష్‌ కూడా నాలాగే మందు తాగుతాడు. అతడు డైరెక్ట్‌గా నాకు ఎటువంటి అవకాశాలు ఇవ్వకపోయినా ఓరకంగా(మారి సినిమాతో) నాకు జీవితాన్ని ఇచ్చాడు.

మా మధ్య అనుబంధం అలాంటిది!
మారి మూవీ షూటింగ్‌లో నాతో చాలా సరదాగా ఉండేవాడు. అతడు ధరించిన కళ్లజోడు కూడా తీసుకున్నాను. మా మధ్య అంతటి అనుబంధం ఉంది. ఓసారి ధనుష్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. స్వచ్ఛందంగా మందు తాగడం మానేశాడు. ఏ పార్టీలో కూడా మందు ముట్టుకోలేదు. నాక్కూడా మద్యపానం మానేయమని చాలామంది సలహా ఇచ్చారు. కానీ పట్టించుకోలేదు. చావు చివరి అంచుల దాకా వెళ్లినప్పుడు నాకు జీవితం అంటే ఏంటో తెలిసొచ్చింది. అప్పుడే ఈ వ్యసనానికి స్వస్తి పలికాను. కాబట్టి ఎవరూ చెడు అలవాట్ల జోలికి వెళ్లి జీవితాన్ని నాశనం చేసుకోకండి' అని చెప్పుకొచ్చాడు రోబో శంకర్‌.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/ 040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

చదవండి: నిహారిక ప్రేమ లేఖ.. ఎవరికో తెలుసా?
అమ్మాయిలను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు.. ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ గెల్చుకుందెవరంటే? తన ఎలిమినేషన్‌ తథ్యం?!

మరిన్ని వార్తలు