కళా దర్శకుడు అంగముత్తు షణ్ముఖం కన్నుమూత

28 Jun, 2021 08:11 IST|Sakshi
అంగముత్తు షణ్ముఖం

ప్రముఖ సినీ కళా దర్శకుడు అంగముత్తు షణ్ముఖం(60) క్యాన్సర్‌తో ఆదివారం చెన్నైలో తుది శ్వాస విడిచారు. ఈయన స్థానిక నుంగంబాక్కంలోని కుమారప్ప మొదలి వీధిలో నివసిస్తున్నారు. 40 ఏళ్లుగా సినీ కళామతల్లికి విశేష సేవలు అందించారు. తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ హీరోల చిత్రాలకు పని చేశారు. ఈయన సినీ కళా దర్శకుల సంఘానికి అధ్యక్షుడిగా, దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్యకు మూడుసార్లు కార్యదర్శిగా పనిచేశారు.

అంగముత్తు షణ్ముఖం మృతికి తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులు, దక్షిణ భారత సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు ఆర్‌.కె.సెల్వమణి తదితరులు సంతాపం తెలిపారు. ఆయన భౌతిక కాయానికి సోమవారం ఉదయం స్థానిక నుంగంబాక్కంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

చదవండి: ఆ గ్రేట్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ను మర్చిపోవడం కష్టం, ఎందుకంటే?

మరిన్ని వార్తలు