సెట్స్‌లో గుక్కపెట్టి ఏడ్చిన నటి

22 Jan, 2021 19:58 IST|Sakshi

'అల్లావుద్దీన్‌ నామ్‌తో సునా హోగా' సీరియల్‌ నటి ఆషి సింగ్‌ సెట్స్‌లో ఒక్కసారిగా ఏడ్చేశారట. గురువారం ఈ సీరియల్‌ క్లైమాక్స్‌ షూటింగ్‌ ముగిసింది. అందులో భాగంగా నటుడు సిద్ధార్థ్‌ నిగమ్‌ ఆఖరి డైలాగ్‌ను అప్పజెప్పాడు. దీంతో సెట్స్‌ అంతా గుండు పిన్ను కింద పడినా వినిపించేంత నిశ్శబ్ధంగా మారిపోయింది. ఇంతలో తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక ఆషి ఏకధాటిగా ఏడ్చేసింది. అయితే దీనికి ఇంకో కారణం కూడా ఉంది. ఆషి ఆరు నెలల క్రితం నుంచి ఈ సీరియల్‌లో భాగమయ్యారు. అవ్‌నీత్‌ కౌర్‌ స్థానంలో ఆమె కొత్తగా వచ్చి చేరారు. దీంతో అవ్‌నీత్‌ అభిమానులు మొదట్లో ఆమెను విపరీతంగా ట్రోల్‌ చేశారు. ఈ దెబ్బతో ఆమె తను పెట్టే పోస్టుల్లో కామెంట్లను చదవడమే మానేసింది. (చదవండి: ముద్దు పెట్టలేదని రిజెక్ట్‌ చేసింది: అక్షయ్‌)

ఒకరి స్థానంలోకి వచ్చినందుకు ఇలాంటి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని ముందే గ్రహించి అందుకు సిద్ధమైన ఆషి దీన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుంది. తనేంటో నిరూపించుకుంటానని సవాలు చేసింది. చెప్పినట్లుగానే ఆ పాత్రలో ఒదిగిపోయి ప్రశంసలు దక్కించుకుంది. ఇక ఈ సీరియల్‌ అనుభవాల గురించి మాట్లాడుతూ.. "నేను చేసిన జాస్మిన్‌ పాత్రను నా బిడ్డలా పెంచుతూ వచ్చాను. ఇది పక్కన పెడితే తొలిసారి కత్తులు చేత పట్టుకోవడం, గుర్రం ఎక్కి కూర్చోవడం వంటివి చాలా సంతోషాన్నిచ్చాయి. సిద్ధార్థ్‌ను మొదటిసారి ఇక్కడ సెట్స్‌లోనే కలిశాను. కానీ ఇంత మంచి స్నేహితులమవుతాం అనుకోలేదు" అని చెప్పుకొచ్చింది. కాగా ఆషికి ఇది తొలి ఫాంటసీ సీరియల్‌. నిజానికి ఆమెకు కల్పితంగా ఉండే సీరియల్స్‌లో నటించడం పెద్దగా ఇష్టం ఉండదు. వాస్తవానికి దగ్గరగా ఉండే షోలతో పాటు  యూత్‌ బేస్‌డ్‌ షోలలో నటించడమే ఇష్టం. (చదవండి: నేను అలానే పెరిగాను.. ఇప్పుడు మారలేను: దీపికా)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు