అవెంజర్స్​ సుందరికి పెళ్లైందా?

10 Jun, 2021 17:08 IST|Sakshi

లాస్​ ఏంజెల్స్​: మార్వెల్ ‘అవెంజర్స్​’ సిరీస్​లో వాండా మాగ్జిమాఫ్​ అలియాస్​ స్కార్లెట్ విచ్ క్యారెక్టర్​తో అలరించింది నటి ఎలిజబెత్ ఓల్సెన్​. ఓల్సెన్​కు హాట్​ నటిగా యూత్​లో మంచి క్రేజ్ కూడా ఉంది. అయితే తనకు పెళ్లైందనే విషయం.. పొరపాటుగా అందో లేదా కావాలనే అందోగానీ ఇప్పుడది హాలీవుడ్ వర్గాల్లో టాపిక్​గా మారింది. 

ఓల్సెన్ రీసెంట్​గా యాక్టర్స్​ ఆన్ యాక్టర్స్​ అనే ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ వీడియో ఇంటర్వ్యూలో డిస్నీ హాట్ స్టార్​ లో స్ట్రీమ్​ అవుతున్న వాండావిజన్​ ముచ్చట్లు పంచుకుంది. అంతేకాదు రెండో సీజన్ ఉండదని క్లారిటీ ఇచ్చింది కూడా. ఒకానొక టైంలో ఓల్సెన్​, నటి కేలీ క్యూకోతో మాట్లాడుతుండగా రాబీ అమెట్ట్​ను తన భర్తగా పేర్కొంది. రాబీ, ఓల్సెన్​ 2016 నుంచి డేటింగ్​లో ఉన్నారు. ఇద్దరూ ఒకే అపార్ట్​మెంట్​లో కలిసి ఉంటున్నారు కూడా. ఇప్పుడామె ‘భర్త’ అని సంభోధించడంతో రహస్యంగా పెళ్లి చేసుకున్నారా? అని హాలీవుడ్ మీడియా హౌజ్​లు చర్చించుకుంటున్నాయి. అయితే నవ్వుతూనే ఆ మాట అనడంతో ఆమె జోక్​ చేసి ఉండొచ్చని నటుడు మార్క్​ రఫెల్లో(అవెంజర్స్​ హల్క్​) అంటున్నాడు. ఇక వీళ్ల పెళ్లి గురించి సన్నిహితులుగానీ, కుటుంబ సభ్యులుగానీ స్పందించకపోవడం విశేషం.

కాగా, నాలుగేళ్ల వయసుకే ఓల్సెన్​ యాక్టింగ్ కెరీర్​ను మొదలుపెట్టింది. మార్థా మార్సీ మే మార్లెనె(2011)తో  హీరోయిన్​గా మారడంతో.. తొలి సినిమాకే అవార్డు విన్నింగ్ పర్​ఫార్మెన్స్​ ఇచ్చింది. ‘రెడ్ లైట్స్​, సైలెంట్ హౌజ్​, కిల్ యువర్ డార్లింగ్స్​, గాడ్జిల్లా(2014), విండ్ రివర్​ సినిమాలతో పాటు అవెంజ్స్ సిరీస్​తో పాపులారిటీ సంపాదించుకుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు