Balagam Movie Records: సెంచరీ దాటేసిన బలగం మూవీ.. సరికొత్త రికార్డ్ సొంతం!

5 Jul, 2023 12:28 IST|Sakshi

చిన్న సినిమా ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించిన చిత్రం బలగం. తెలంగాణ సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్లు తెరపై ఆవిష్కరించారు. వేణు యెల్దండి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బలగం కలెక్షన్ల వర్షం కురిపించింది. దిల్‌ రాజు సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత ఈ చిత్రాన్ని నిర్మించారు. 

తెలంగాణ గ్రామీణ సంప్రదాయాన్ని తెరపై ఆవిష్కరించిన వేణుపై సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా ప్రభావం ఎంతలా ఉందటే.. ఏకంగా పల్లెల్లో ప్రత్యేక షోలు ప్రదర్శించే స్థాయికి చేరుకుంది. అంతలా ఆడియన్స్‌కు కనెక్ట్ అయింది. వెండితెరపై సత్తాచాటిన ఈ చిత్రాన్ని అవార్డులు అంతేస్థాయిలో వరించాయి. ఏకంగా అంతర్జాతీయ వేదికలపై బలగం పేరు మార్మోగింది. 

(ఇది చదవండి: కానిస్టేబుల్ పరీక్షలో 'బలగం' సినిమాపై ప్రశ్న.. అదేంటంటే?)

ఇప్పటివరకు అంతర్జాతీయ వేదికలపై వందకుపైగా అవార్డులు సొంతం చేసుకుని అరుదైన రికార్డ్ సాధించింది. పలు దేశాల్లో జరిగిన ఈవెంట్స్‌లో వివిధ విభాగాల్లో బలగం సినిమాకు అవార్డులు దక్కాయి. ఇంతవరకు ఏ సినిమా సాధించలేని అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 

కాగా.. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్ జంటగా నటించారు. మురళీధర్ గౌడ్, కేతిరి సుధాకర్‌ రెడ్డి, జయరామ్, రూప, రచ్చ రవి  ప్రధాన పాత్రల్లో కనిపించారు. గతంలో ‘స్వీడిష్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2023’లో ‘బలగం’ చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా ప్రియదర్శి, ఉత్తమ సహాయ నటుడుగా కేతిరి సుధాకర్‌ రెడ్డి (కొమురయ్య పాత్రధారి) అవార్డులను గెలుచుకున్నారు. 

కానిస్టేబుల్, గ్రూప్-4 పరీక్షల్లో ప్రశ్నలు

అంతే కాకుండా గతంలో తెలంగాణలో జరిగిన కానిస్టేబుల్ రాతపరీక్షలో ఓ ప్రశ్న వచ్చిందంటే బలగం సినిమాకు ఉన్న ఆదరణ ఏంటో అర్థమవుతోంది. ఇటీవలే జరిగిన గ్రూప్-4 పరీక్షలో సైతం బలగం సినిమా ప్రశ్నను అడిగారు. తెలంగాణలో పల్లెపల్లెలో బలగం సినిమాకు పెద్దఎత్తున అభిమానులు ఉన్నారు.  అలాగే మార్చి 2023లో ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో ఉత్తమ నాటకం విభాగంలో అవార్డ్ దక్కింది.  

(ఇది చదవండి: సమంత కీలక నిర్ణయం.. షాక్‌లో అభిమానులు!)
 

మరిన్ని వార్తలు