Balakrishna Vs Jr NTR: జూ. ఎన్టీఆర్‌పై బాలకృష్ణ ద్వేషం.. చిచ్చు పెట్టింది ఎవరు..?

18 Jan, 2024 18:25 IST|Sakshi

నందమూరి వంశంలో ఒంటరిగా మిగిలిన తారక్‌

నాడు ఎన్టీఆర్ ఘాట్‌ పరిస్థితి ఎలా ఉండేది ..?

పవన్‌ కావాలి.. అసలైన వారసుడు వద్దు

జై లవకుశ చిత్రంలోని డైలాగ్స్‌ షేర్‌ చేస్తున్న ఫ్యాన్స్‌

'వుయ్‌ స్టాండ్‌ విత్‌ ఎన్టీఆర్‌, ఎండ్‌ ఆఫ్‌ టీడీపీ' హ్యాష్‌ ట్యాగ్స్‌ వైరల్‌

సీనియర్ ఎన్టీఆర్ 28వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా మ‌రోసారి జూ. ఎన్టీఆర్‌, నంద‌మూరి ఫ్యామిలీల మ‌ధ్య విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. నేడు తెల్ల‌వారుజామున జూ. ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్‌లు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తారక్‌ బ్రదర్స్‌  అక్కడి నుంచి వెళ్లిపోయిన కొన్ని గంటల తర్వాత బాల‌కృష్ణ‌  కూడా తన తండ్రికి నివాళి అర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ తారక్‌, కల్యాణ్‌ రామ్‌లు ఉన్న ఫ్లెక్సీలను వెంట‌నే తొలగించాలని బాల‌కృష్ణ‌ హుకుం జారీ చేశాడు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ నేతలు వాటిని తొలగించారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

నందమూరి వంశంలో ఒంటరిగా మిగిలిన తారక్‌
ఈ క్రమంలో తారక్‌ను నందమూరి ఫ్యామిలీ ఒంటరిని చేసిందని సోషల్‌ మీడియాలో భారీగా వైరల్‌ అవుతుంది. బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబంలోని ఇతర సోదరులు, అక్కాచెల్లెళ్ల పిల్లలకు సీనియర్‌ ఎన్టీఆర్‌తో ఎలాంటి రక్తసంబంధం ఉందో అలాంటి వారసత్వపు హక్కు కూడా జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఉంది.  కానీ తన బావ చంద్రబాబు రాజకీయం కోసం, తన అల్లుడు లోకేష్‌ రాజకీయ భవిష్యత్‌ కోసం నెత్తుటి సంబంధాన్ని కూడా తెంచేందుకు బాలకృష్ణ అడుగులు వేశాడు. తారక్‌ను ఎప్పటికైనా ఒంటరిగానే మిగల్చాలని చంద్రబాబు చేస్తున్న కుట్రలో  బాలకృష్ణ పలుమార్లు భాగం పంచుకుంటూనే ఉన్నాడు.

నాడు ఎన్టీఆర్ ఘాట్‌ పరిస్థితి ఎలా ఉండేది ..?
విడ్డూరుం కాకపోతే.. ఎలాంటి విలువలు లేని పవన్ కల్యాణ్ కావాలి గానీ సొంత కుటుంబసభ్యుడు అయిన తారక్‌ మాత్రం పనికిరాకుండా పోయాడా..? తాతకు సిసలైన మనమడిగా మిగిలింది తారక్‌ మాత్రమే కదా..?  అంటూ బాలయ్య తీరుపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

సుమారు 6 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఘాట్‌లో కనీసం పూలు అలంకరించడానికి కూడా ఎవరూ లేకపోతే, జూనియర్ ఎన్టీఆర్ ఆ బాధ్యత తీసుకొని  తన వాళ్లతో జయంతికి, వర్ధంతికి అక్కడ అలంకరణ చేయిస్తున్నారు. అలాంటిది ఈరోజు ఆయన ఫ్లెక్సీలే అడ్డు అయిపోయాయని పీకి పారేస్తున్నారంటే ఎంతటి దుర్మార్గపు చర్య. తన తాత సమాధి వద్ద తారక్‌ ఫ్లెక్సీలు ఉంటే బాలయ్యకు వచ్చిన నష్టమేమిటి? జీఎచ్‌ఎంసీ సిబ్బంది మాదిరి ప్లెక్సీలు తొలగించమని ఆదేశించడం ఏంటి..? ఏ హక్కుతో వాటిని తొలగించారు..? అసలు ఎన్టీయార్ ఘాట్ వద్దకు ఎవరు రావాలి..? ఎవరు రాకూడదు..? అని చెప్పడానికి బాలకృష్ణ ఎవరు..?

అక్కడ ఎవరి బ్యానర్లు ఉండాలని చెప్పడానికి బాలయ్యకు హక్కు ఎక్కడిది..? నందమూరి తారకరామారావు అనే వ్యక్తి అందరివాడు. ఆయన ఎవరి సొత్తు కాదు. ఎంటో బాలయ్య మాదిరే ఆయన మాటలు కూడా ఏ మాత్రం ఎవరికీ అర్థం కావు. ఏదేమైనా  నందమూరి వంశంలో తారక్‌ను ఒంటరిని చేయాలనే చంద్రబాబు కుట్రకు విజయవంతంగా అడుగులు పడుతున్నాయి. అందుకే ఇంత జరిగినా తన రక్త సంబంధీకులు ఎవరూ నోరెత్తి కూడా తిరిగి మాట్లాడటం లేదు. కానీ తారక్‌ ఫ్యాన్స్‌ మాత్రం మేమున్నాం అంటూ #WeStandWithNTR అనే హ్యాష్‌ ట్యాగ్‌తో పాటు #EndOfTDP అంటూ వారు వైరల్‌ చేస్తున్నారు. 

జై లవకుశ చిత్రంలోని డైలాగ్స్‌ షేర్‌ చేస్తున్న ఫ్యాన్స్‌
జై లవకుశ చిత్రం నుంచి తారక్‌ చెప్పిన డైలాగ్స్‌ను కూడా వారు వైరల్‌ చేస్తున్నారు. అందులో 'మనం అనేది అబద్ధం.. నేను అనేది నిజం. ప్రేమను పగగా మార్చింది మీరే.. మీలో ఒక్కడిగా గుర్తిస్తారని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాను' అనే డైలాగ్స్‌ గుర్తు చేస్తూనే.. గతంలో ఎన్నికల కోసం తారక్‌ను ఎడాపెడా వాడేసుకున్నారని చంద్రబాబు అండ్ తెలుగుదేశం బ్యాచ్‌పై తారక్‌ ఫ్యాన్స్‌ విరుచుకుపడపుతున్నారు. తారక్‌లో ఫైర్‌ను గుర్తించిన చంద్రబాబు తన కుమారుడికి ఎక్కడ అడ్డు వస్తాడో అని పక్కకు తప్పించే ఎత్తుగడ ఎప్పుడో వేశాడంటూ వారు గుర్తుచేస్తున్నారు.

ఏ మాత్రం రాజకీయ జ్ఞానం లేని లోకేష్‌కు తారక్‌ ఎక్కడ పోటీ అవుతాడో అని చంద్రబాబులో భయం పట్టుకుంది. చంద్రబాబు కన్నింగ్‌ గేమ్‌ను అర్థం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్‌ పార్టీని వదిలేశాడు. చివరకు తన సోదరి అయిన  నందమూరి సుహాసినికి టీడీపీ టికెట్టు ఇచ్చి ఎన్నికల బరిలో నిల్చోబెట్టినా కూడా తను ప్రచారం చేయలేదు. అలా తన తాత పెట్టిన పార్టీకి తారక్‌ దూరం అయ్యాడు. లేని వారసత్వం కోసం లోకేష్‌ను తెరపైకి తీసుకొచ్చేందుకు పక్కా ప్లాన్‌తో రక్తసంబంధంలో చంద్రబాబు  చిచ్చిపెట్టాడు. అందులో భాగంగానే తారక్‌ నందమూరి వంశంలో నేడు ఒంటరిగా మిగిలాడని చెప్పవచ్చు.

>
మరిన్ని వార్తలు