Bhoothaddam Bhaskar Narayana: భూతద్ధం భాస్కర్‌ నారాయణ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది!

13 Jan, 2023 10:13 IST|Sakshi

శివ కందుకూరి హీరోగా రాశి సింగ్ హీరోయిన్‌గా నటించిన చిత్రం భూతద్దం భాస్కర్‌. పురుషోత్తం రాజ్‌ దర్శకత్వం వహించగా మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌, విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్లపై స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌కు మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని మార్చి 31న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు నిర్ణ‌యించుకున్నారు. దీనికి కూడా చిన్న మోషన్ పోస్ట‌ర్‌తో డేట్ ఎనౌన్స్ చేస్తారు. 

ఈ చిత్రంలో తర్వాత జరగబోయే స‌న్నివేశాలను ముందుగా ఊహించడం చాలా క‌ష్టంగా ఉంటుందని, ఆరేంజ్‌లో ద‌ర్శ‌కుడి స్క్రీన్‌ప్లే వుంటుందని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు శ్రీచరణ్‌ పాకాల, విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జ‌రుగుతున్నాయి.

చదవండి: వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ
నాటు నాటు.. ఆ పాటేంది? ఆ యాసేంది? నటి ఘాటు రిప్లై

మరిన్ని వార్తలు