ఆసుపత్రిలో చేరిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌

1 Oct, 2020 18:44 IST|Sakshi

ఢిల్లీ : హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌ 13 ఫేమ్, మోడల్‌, పంజాబీ సింగర్‌‌ హిమాన్షి ఖురానా నాలుగు రోజుల కిందట కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. కాగా నాలుగు రోజులుగా హోం ఐసోలేషన్‌లో ఉంటున్న హిమాన్షి ఆరోగ్య పరిస్థితి గురువారం కాస్త సీరియస్‌ అయింది . ఆమె 105 డిగ్రీల జ్వరంతో బాధపడుతుందని.. ఆక్సిజన్‌ లెవెల్‌ కూడా దారుణంగా పడిపోవడంతో అప్రమత్తమై లుదియానాలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్‌ అయ్యారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుటపడిందని తెలిపారు.ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోవడంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతోనే ఆమెకు ఈ పరిస్థితి తలెత్తిందని వైద్యులు పేర్కొన్నారు. (చదవండి : అహ్మద్‌ పటేల్‌కు కరోనా పాజిటివ్‌)

 కాగా వ్యవసాయ బిల్లలకు వ్యతిరేకంగా ఈ నెల 25న దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో రైతులకు మద్దతుగా హిమాన్షి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను ఆందోళనల్లో పాల్గొన్న ఫొటోలను కూడా షేర్ చేసింది. మనమంతా రైతులకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని కూడా ఆమె తెలిపారు. రైతుల ఆందోళనలో పాల్గొన్న తర్వాత తిరిగి షూటింగ్‌కు వెళ్లడానికి ముందు ముందుజాగ్రత్త చర్యగా కరోనా పరీక్ష చేయించుకోగా ..హిమాన్షికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

దీంతో తనను కలిసిన అందరూ దయచేసి కరోనా పరీక్ష చేయించుకోవాలని కూడా హిమాన్షి కోరారు. హిమాన్షి ఆరోగ్య విషయం తెలుసుకున్న ఆమె అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు.కాగా పంజాబీ మ్యూజిక్‌ పాటల ద్వారా హిమాన్షి ఖురానా మంచి పాపులారిటీ సంపాదించారు. బిగ్‌బాస్‌ సీజన్‌ 13లో హిమాన్షి ఖురానా నటుడు అసీమ్‌ రియాజ్‌తో మంచి రిలేషిన్‌షిప్‌ ఏర్పరచుకోవడంతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు. ఆ తర్వాత వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీ ద్వారా షోలో రీఎంట్రీ ఇచ్చిన హిమాన్షికి రియాజ్‌ లవ్‌ ప్రొపోజ్‌ చేయడం ద్వారా మంచి క్రేజ్‌ సంపాదించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు