ఫిట్‌నెస్ వీరుడు అఖిల్ సార్థ‌క్‌

6 Sep, 2020 21:35 IST|Sakshi

బిగ్‌బాస్‌లోకి రావ‌డంతో త‌న క‌ల నెర‌వేరిందంటున్నాడు అఖిల్ సార్థ‌క్‌. అయితే త‌న పేరు వెన‌కాల అక్కినేని హ‌స్తం ఉందంటున్నారు. ఆయ‌న న‌టించిన సిసింద్రి చిత్రం విడుద‌లైన మరుస‌టి రోజే తాను జ‌న్మించడంతో కుటుంబ స‌భ్యులు త‌న‌కు అఖిల్ అని పేరు పెట్టాడ‌ని చెప్పుకొచ్చాడు. రెండేళ్ల క్రిత‌మే ల‌వ్ ఫెయిల్ అయింద‌ని కాబ‌ట్టి ఇప్ప‌డు సింగిల్ అని చెప్తున్నాడు. హైద‌రాబాద్ మోస్ట్ డిజైర‌బుల్ మెన్ జాబితాలో అఖిల్ మూడో స్థానం సంపాదించాడు. ప‌లు సీరియల్స్‌లోనూ న‌టించాడు. బిగ్‌బాస్ హౌస్‌లో త‌ను తన‌లాగే ఉంటాన‌ని, నటించాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్తున్నాడు. సింగిల్‌గా ఉన్న‌ ఈ ఫిట్‌నెస్ వీరుడు ఇంకొంత‌కాలం వ‌ర‌కు బ్యాచిల‌ర్‌గానే ఉంటానంటున్నాడు. ఇక‌ స్టేజ్ మీదే 50 పుష్ అప్స్ చేసి అంద‌రినీ నోరెళ్ల‌బెట్టేలా చేశాడు.

మరిన్ని వార్తలు