పీఆర్ టీమ్ పెట్టుకుంటే సోహైల్ క‌థ వేరే ఉండేది

19 Dec, 2020 17:08 IST|Sakshi

బిగ్‌బాస్ ఫైన‌లిస్టు హారిక చెప్పిన‌ట్లుగా పోరాటం ముగిసింది. అటు కంటెస్టెంట్ల‌తో పాటు, వారిని గెలిపించేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసిన అభిమానుల పోరాటం ముగిసింది. దీని ఫ‌లితం మాత్రం తేలాల్సి ఉంది. ఈసారి గ‌త సీజ‌న్ల కంటే భారీ స్థాయిలో ఓట్లు ప‌డిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోప‌క్క నెట్టింట్లో అభిజితే విన్న‌ర్ అన్న పేరు వినిపిస్తోంది. కానీ అది బిగ్‌బాస్ షో. అంచ‌నాలు తారుమారు చేసేందుకు బిగ్‌బాస్‌కు ఓ క్ష‌ణం ప‌ట్ట‌దు. గెలుపోట‌ముల లెక్క రేపు నాగార్జున చూసుకుంటారు. కాబ‌ట్టి ఈ విష‌యాన్ని కాస్త ప‌క్క‌న పెడితే మాజీ కంటెస్టెంటు అలీ రెజా కాబోయే విజేత ఎవ‌ర‌నేది చెప్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

ట్రోఫీ క‌న్నా అదే ముఖ్యం
"సోహైల్ నాకు 8 ఏళ్లుగా తెలుసు. అత‌డు నా త‌మ్ముడు లాంటి వాడు. త‌నేంటో ప్రూవ్ చేసుకుంటేనే స‌పోర్ట్ చేస్తానని ముందే చెప్పాను. రెండు మూడు వారాల్లోనే అత‌డేంటో నిరూపించుకున్నాడు. అప్పుడే అనుకున్నా, వీడు క‌చ్చితంగా టాప్ 5లో ఉంటాడ‌ని! కొంద‌రు అత‌డు ముస్లిం కాబ‌ట్టి స‌పోర్ట్ చేస్తున్నా అంటున్నారు. అది పూర్తిగా అబ‌ద్ధం. ఇలా మ‌తాల‌ను అడ్డు పెట్టుకుని నేను ఏ ప‌నీ చేయ‌ను. అత‌డికే కాదు, గ‌తంలోనూ ఎవ‌రికీ మ‌త‌ప‌రంగా ప‌క్ష‌పాతం చూపించ‌లేదు. సోహైల్ జెన్యూన్‌, చిన్న పిల్లాడి మ‌న‌స్త‌త్వం. అవి చూశాకే మూడో వారం నుంచి అత‌డికి స‌పోర్ట్ చేయ‌డం ప్రారంభించాను. అత‌డు షోకి వెళ్లేముందు కొన్ని స‌లహాలు ఇచ్చాను. ట్రోఫీ అందుకోవ‌డం క‌న్నా ప్ర‌త్యేక‌త‌ను చాటుకోవ‌డం ముఖ్య‌మ‌ని చెప్పాను. ఎలాంటి ప‌రిస్థితిలోనైనా నువ్వు నీలాగే ఉండ‌మ‌ని సూచించాను. అత‌డు అలాగే ఉన్నాడు కూడా! అందుకే ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా నామినేషన్లంటే భ‌య‌ప‌డొద్ద‌న్నాను. ఎందుకంటే డేంజ‌ర్ జోన్‌లో ఉంటేనే ప్రేక్ష‌కులకు మ‌న‌కు ఓట్లు వేసే అల‌వాటు పెరుగుతుంది" అని చెప్పుకొచ్చాడు. (చ‌ద‌వండి: ఆ ఒక్క‌రికే రాహుల్ సిప్లిగంజ్‌స‌పోర్ట్!)

అభిజిత్ వ‌ల్ల కాదు
"కోపాన్ని జ‌యించి త‌న‌ను తాను ఎంత‌గానో మార్చుకున్న సోహైల్ ట్రోఫీ గెలిచేందుకు అన్ని విధాలా అర్హుడు. ఈసారి అమ్మాయి గెలిచేందుకు జీరో ఛాన్స్ ఉంది. సోష‌ల్ మీడియా ప్ర‌కారం అభిజిత్‌, సోహైల్ మ‌ధ్య గ‌ట్టి పోటీ ఉంది. కానీ సోహైల్ కూడా మంచి పీఆర్ టీమ్‌ను పెట్టుకుంటే ఫ‌లితం మ‌రోలా ఉండేది. అయితే అత‌డి కుటుంబానికి పీఆర్ టీమ్ పెట్టుకునేంత ఆర్థిక స్థోమ‌త లేదు. కానీ ఇప్ప‌టికీ సోహైల్ గెలిచేందుకు అవ‌కాశాలున్నాయి. సోహైల్ వల్లే ఈ సీజ‌న్ ముందుకు న‌డిచింది త‌ప్ప అభిజిత్ వ‌ల్ల కాదు అని స్ప‌ష్టం చేశాడు. ఏదేమైనా త‌న దృష్టిలో సోహైల్ ఇప్ప‌టికే గెలిచేశాడ‌ని అలీ రెజా పేర్కొన్నాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్ గిఫ్ట్‌: బ‌ంగారం కొన్న గంగ‌వ్వ‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు