నాతో జీవితంలో మాట్లాడ‌కు: అమ్మ రాజ‌శేఖ‌ర్‌

24 Sep, 2020 18:02 IST|Sakshi

ఇంటి స‌భ్యుల క‌సి చూస్తుంటే బిగ్‌బాస్ ఇచ్చిన ఫిజిక‌ల్ టాస్క్ ఇప్ప‌ట్లో పూర్త‌య్యేలా క‌నిపించ‌డం లేదు. ఓవైపు నిద్రాహారాలు మాని గెలుపు కోసం ప‌రిత‌పిస్తున్న‌ మ‌నుషుల టీమ్ దెబ్బ తిన్న పులిలా ఉంటే, మ‌రోవైపు అన్ని సౌక‌ర్యాలు, సౌల‌భ్యాల‌ను వాడుకుంటున్న రోబో టీమ్‌ గెలుపుకు ఆమ‌డ దూరంలో ఉంది. ఇక్క‌డ మ‌నుషుల టీమ్‌కు కండ‌బ‌లం ఉంటే ప్ర‌త్య‌ర్థి టీమ్‌కు బుద్ధి బ‌లం ఉంది. దీంతో ఎత్తుకు పై ఎత్తుల‌తో ఆట న‌డుస్తూనే ఉంది. అయితే మాస్టారు అంటూ అమ్మ రాజశేఖ‌ర్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి క‌బుర్లు చెప్తూ నెమ్మ‌దిగా చార్జింగ్ పెట్టేసుకుని వెన్నుపోటు పొడిచాడు అవినాష్‌. (చ‌ద‌వండి: బిగ్‌బాస్: శత్రువులుగా మారబోతున్న స్నేహితులు?)

దీంతో ఆల‌స్యంగా విష‌యం అర్థ‌మైన మాస్ట‌ర్‌కు లోప‌ల ఎలా ఉన్నా బ‌య‌ట‌కు మాత్రం న‌వ్వేశాడు. కానీ తాజాగా రిలీజైన ప్రోమోను చూస్తుంటే ఆ విష‌యాన్ని అక్క‌డితో మ‌ర్చిపోకుండా మ‌నుసులో పెట్టుకున్న‌ట్లు అనిపిస్తోంది. "ఈ జీవితంలోనే కాదు, జ‌న్మ‌జ‌న్మ‌ల‌లోనూ అవినాష్ త‌న‌తో మాట్లాడ‌కూడ‌దు" అని తేల్చి చెప్పాడు. నిన్న‌టి వ‌ర‌కు ఐక‌మ‌త్యంగా ఉన్న మ‌నుషుల టీమ్‌లోనూ బేధాభిప్రాయాలు చోటు చేసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. త‌న టీమ్ స‌భ్యులు చెప్తున్నా విన‌కుండా రోబోల‌తో ఇచ్చిపుచ్చుకునేందుకు ఓ డీల్ కుదుర్చుకునేందుకు సిద్ధ‌మైంది. ఇది రోబోల టీమ్‌కు ప్ల‌స్ పాయింట్‌గా మార‌నుండ‌గా మ‌నుషుల టీమ్‌లో మ‌రిన్ని గొడ‌వ‌ల‌కు దారి తీసేలా క‌నిపిస్తోంది. మ‌రి ఆమె నిర్ణ‌యం హౌస్‌లో ఎంత ర‌చ్చ‌కు దారి తీస్తుందో నేటి ఎపిసోడ్‌లో చూడాలి. (చ‌ద‌వండి: చాలాసార్లు బ‌త‌కాల‌నిపించ‌లేదు: వితికా )

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు