బిగ్‌బాస్‌: అందుకే అఖిల్‌ ఏడ్చాడా?

4 Dec, 2020 17:02 IST|Sakshi

'టికెట్ టు ఫినాలే' రేస్‌ మూడో లెవ‌ల్‌లో ఇద్దరు ప్రాణ స్నేహితులు అఖిల్‌, సోహైల్‌ వెళ్లడంతో ఆట రంజుగా మారింది. డైరెక్ట్‌గా టాప్‌ 5 లోకి ఎవరు వెళ్తారా అనే అసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక గెమ్‌లో భాగంగా ఉయ్యాల నుంచి కిందికి దిగకుండా ఇద్దరు మొండికేసి కూర్చున్నారు. వారిని దించేందుకు బిగ్‌బాస్‌ విఫల ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. పోటీదారులు మాత్రం ఇంచు కూడా కదలడం లేదు.  చివరికి కూర్చున్న‌ద‌గ్గ‌రే ప‌ర‌దాలు చుట్టి వాష్‌రూమ్‌కు వెళ్లారు కానీ గేమ్‌ గివప్‌ ఇవ్వడానికి ఎవ్వరు ముందుకు రాలేదు. దీంతో బిగ్‌బాస్‌ ఒక అడుగు ముందుకేసి వారిని భయపెట్టే ప్రయత్నం చేశాడు. హౌస్‌‌లో ఉన్నపళంగా తుపాకి పేలుడు శబ్దాలు చేశాడు. అయినప్పటికీ అఖిల్‌, సోహైల్‌ ఇసుమంతైనా భయపడలేదు. మిగతా సభ్యులు భయంతో పరుగులు తీశారు. ఇది కూడా వర్కౌట్‌ కాకపోవడంతో ముల్లంగి ర‌సాన్ని ప్రయోగించాడు బిగ్‌బాస్‌.

ముల్లంగి రసాన్ని చెంచాతో ఒకరికొరు తాగించుకుంటూ.. తాను ఉయ్యాల మీద ఉండ‌టానికి ఎందుకు అర్హుడు? ఎదుటివాడు ఎందుకు అన‌ర్హుడు? అన్న విష‌యాన్ని చెప్పాల‌ని ఆదేశించాడు. ఇక్కడ గొడవ జరిగి ఎవరో ఒకరు దిగిపోతారని భావించాడు బిగ్‌బాస్‌. అయితే వీరిద్దరు మాత్రం చిన్న గొడవ పెట్టుకొని మళ్లీ కలిసిపోవడంతో బిగ్‌బాస్‌ వ్యూహం మరోసారి బెడిసికొట్టింది. (చదవండి : మోనాల్ గుట్టు ర‌ట్టు చేసిన అభిజిత్‌)

ఈ సారి ఎలాగైనా ఒకరిని ఉయ్యాల నుంచి కిందికి దింపాలని కంకణం కట్టుకున్న బిగ్‌బాస్‌.. చివరిగా బెదిరింపు అస్త్రాన్ని ప్రయోగించినట్లు తాజా ప్రోమో చూస్తే తెలుస్తోంది. ప్రోమోలో సోహైల్‌ భోరును ఏడుస్తున్నాడు. అఖిల్‌ కూడా కన్నీరు పెట్టుకున్నాడు. ఇద్దరిని అభిజిత్‌ ఓదార్చాడు. దీన్ని బట్టి చూస్తే బిగ్‌బాస్‌ ఏదో పెద్ద ప్లానే వేసినట్టు అర్థమవుతుంది. గంటలు గడిచిపోతున్నా.. ఇద్దరు ఉయ్యాల దిగకపోవడంతో.. బజర్‌ మోగే సమయానికి ఎవరో ఒకరు దిగాలని, లేదంటే టికెట్‌ టు ఫినాలే ఎవరికి దక్కదని బిగ్‌బాస్‌ హెచ్చరించారని, అందుకే సోహైల్‌ ఏడ్చాడని లీకుల వీరులు చెబుతున్నారు. సోహైల్‌ని దిగమని అఖిల్‌ కోరారని, అందుకే సోహైల్‌ కిందకి దిగి ఏడ్చాడని తెలుస్తోంది. మరి అది ఎంతవరకు నిజమో నేటి ఎపిసోడ్‌లో తేలిసిసోతుంది. కాగా, టికెట్‌ టు ఫినాలే విన్నర్‌ అఖిలేనని ఇప్పటికే లీకుల వీరులు చెప్పేశారు. అయితే సోహైల్‌ మాత్రం గేమ్‌ ఓడిపోయి కాకుండా త్యాగం చేసి అఖిల్‌ని గెలిపించినట్లు తెలుస్తోంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు