సోష‌ల్ మీడియాలో అభిజిత్ ఫ్యాన్స్ ర‌చ్చ ర‌చ్చ‌..

22 Nov, 2020 16:50 IST|Sakshi

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన రియాలిటీ షోగా‌ బిగ్‌బాస్ త‌న పేరు లిఖించుకుంది. ఏ యేటికాయేడు రెట్టింపు ఉత్సాహంతో అంత‌కు మించిన వినోదంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తూనే ఉంది. ఈ క్ర‌మంలో వ‌చ్చిన నాల్గో సీజ‌న్ స‌క్సెస్‌ఫుల్‌గా 11 వారం ముగింపుకు చేరుకుంది. హౌస్‌లో వంట‌ల‌క్క‌గా స్థిప‌ర‌డిపోయిన లాస్య నేడు ఎలిమినేట్ కానుంద‌ని లీకువీరులు ట‌ముకేసి మ‌రీ చెప్తున్నారు. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెడితే ఈ సారి టాప్ 5 లో ఎవ‌రుంటార‌నేది కంటెస్టెంట్ల ఫ్యామిలీలు కూడా కుండ బ‌ద్ధ‌లు కొట్టిన‌ట్లు క్లారిటీగా చెప్పాయి. అభిజిత్ ప‌క్కాగా టాప్ 2 ఉంటార‌ని తేల్చి చెప్పాయి. నిజానికి అభిజిత్‌కు సినిమాల ద్వారా రాని గుర్తింపు బిగ్‌బాస్ ద్వారా వ‌స్తోంది. ఎదుటివారు రెచ్చ‌గొట్టేందుకు ప్ర‌య‌త్నించినా ఎక్క‌డా త‌ప్ప‌టడుగు వేయ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌తాడు. కూల్‌గా మాట్లాడుతూ స‌మ‌స్య పరిష్క‌రించుకుందామ‌ని చెప్తాడు. (చ‌ద‌వండి: అభిజిత్‌తో నాకు ఫ్రెండ్‌షిప్ వ‌ద్దు: సోహైల్‌)

ఫేమ‌స్ అయిన అభిక జంట‌
అన్నింటికీ మంచి అత‌డికో క్లారిటీ ఉంటుంది. త‌న మాట‌ల్లో చేత‌ల్లో అది స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. అందుకే మోనాల్‌తో వ్య‌వ‌హారం ఏదో తేడా కొడుతుంద‌ని ఆమెను ప‌క్క‌న పెట్టేశాడు. హారిక‌తో దోస్తీ చేయ‌డం ప్రారంభించాడు. దీంతో వీళ్ల జంట ఫేమ‌స్ అవగా, నెటిజ‌న్లు వారికి 'అభిక' అని పేరు కూడా పెట్టేశారు. అయితే అభి ఫిజిక‌ల్ టాస్క్‌లో వెన‌కడుగు వేస్తాడు. దాన్ని కూడా మైండ్ గేమ్‌తో ఆడి గెల‌వాల‌నుకుంటాడు. దీంతో ఒక్క రోబో టాస్కు‌ మిన‌హా మిగ‌తావాటిలో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చ‌లేదు. ఈ కార‌ణాన్ని సాకుగా చెప్తూ ఇత‌ర కంటెస్టెంట్లు అభిని నామినేట్ చేయ‌డంతో అత‌డు త‌న రూటు మార్చాడు.

అభికి లేరెవ‌రూ పోటీ..
ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసం ఇచ్చిన ఫిజిక‌ల్‌ టాస్క్‌లో త‌న స్టామినా ఏంటో చూపించాడు. ఇది చూసిన ఆయ‌న అభిమానుల సంబ‌రం చెప్ప‌న‌ల‌వి కాదు. అభిని ఆకాశానికెత్తుతూ పండ‌గ చేసుకుంటున్నారు. 'మా అభికి లేరెవ‌రూ పోటీ, రారెవ‌రూ సాటి' అంటూ సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తున్నారు. అందులో భాగంగా #WeAdmireAbijeet అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట‌ర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. ఈ ట్యాగ్ మీద ఇప్ప‌టికే నాలుగు ల‌క్ష‌ల పైచిలుకు ట్వీట్లు రావ‌డం విశేషం. మొత్తానికి సోష‌ల్ మీడియాలో అభి పేరున రికార్డులు క్రియేట్ చేయాల‌ని వీళ్లు కంక‌ణం క‌ట్టుకున్నట్లే క‌నిపిస్తోంది. (చ‌ద‌వండి: అభిజిత్ క‌చ్చితంగా టాప్ 2లో ఉంటాడు)

మరిన్ని వార్తలు